AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: తండ్రి కలను తీర్చిన తనయ.. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక

కెంబూరి నైమిశా అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమె, చిన్నతనం నుంచి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంది. లా సెట్‌లో 300వ ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి, కష్టపడి చదివి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె విజయం మహిళలకు స్ఫూర్తినిస్తుంది.

Success Story: తండ్రి కలను తీర్చిన తనయ.. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
Youngest Civil Judge Naimis
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Mar 08, 2025 | 12:09 PM

Share

అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై శభాష్ అని ప్రశంసలు పొందుతున్న మహిళ కెంబూరి నైమిశా. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కెంబూరి నైమిశా చిన్నతనం నుంచి పట్టుదలతో ఉండేది. పెదనాన్న కెంబూరి రామ్మోహన్ రావు ఎంపీగా పని చేయగా, పెదనాన్న కెంబూరి లక్ష్మణ్ మోహన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) గా రిటైర్ అయ్యారు. ఈమె మేనత్త కిమిడి మృణాళిని ఏపి రాష్ర్ట మంత్రిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో కెంబూరి నైమిశా ఇంటికి నిత్యం వందలాదిమంది ప్రజలు వచ్చి తమ ఇబ్బందులను విన్నవించుకొని సహాయం చేయమని కోరుతుండేవారు. చిన్నతనంలోనే అలాంటి ఎన్నో సమస్యలను దగ్గరుండి చూసిన నైమిశా తాను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకునేది. అంతేకాకుండా తన తండ్రి భరత్ మోహన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేసేవాడు. అయితే తనకు బ్యాంక్ మేనేజర్ గా తన కెరియర్ ఆగిపోవడం ఇష్టం లేక ఎలాగైనా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం దక్కించుకోవాలని తనకున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే ఆయన ఎంత కష్టపడ్డా సివిల్స్ లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అటు బ్యాంకు ఉద్యోగం లేక, కష్టపడి చదివినా సివిల్స్ లో ఉద్యోగం పొందలేక మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుండేవాడు.

అయితే ఆ తరువాత కొద్దిరోజులకు తేరుకున్న నైమిషా తండ్రి భరత్ మోహన్ తాను పొందలేని ఉన్నత హోదా ఉన్న ఉద్యోగం తన కూతురు ద్వారా అయినా సరే నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు నైమిశాను ఉన్నతాధికారిగా చూడాలని తనకున్న అనుభవంతో గైడెన్స్ ఇచ్చేవాడు. అలా గైడెన్స్ ఇచ్చే క్రమంలో ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత లాసెట్ రాయించాడు. అలా రాసిన లా సెట్ లో 300 ర్యాంకు రావడంతో ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించేందుకు జాయిన్ అయింది. అలా అక్కడ ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ పూర్తి చేసిన నైమిశా అనంతరం విజయనగరం లా బార్ అసోసియేషన్ లో మెంబర్ గా జాయిన్ అయింది.

తరువాత జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు కొన్ని మెటీరియల్స్ తీసుకొని ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించింది. నిరంతరం తన దగ్గర ఉన్న పుస్తకాలనే చదువుతూ తెలియని విషయాలు తన తల్లిదండ్రులతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదుల వద్ద తెలుసుకొని జ్యుడీషియల్ ఎగ్జామ్ రాసింది. ఎట్టకేలకు చదువు పూర్తి చేసుకున్న రెండు సంవత్సరాలకే జూనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగం పొందింది. జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక కావడంతో కెంబూరి నైమిశా తల్లి తండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా నైమిశ మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం తెలుసుకోవాలని, సమాజంలో మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తమ హక్కుల ద్వారా మాత్రమే వాటిని ఎదుర్కోవాలని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..