AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: మన దేశంలో ఈ రాష్ట్రాల్లో శుభ్రమైన గాలి ఉంది.. ఇతర ప్రదేశాల్లో వాయు కాలుష్యం ఎలా తగ్గించవచ్చంటే..

శీతాకాలంలో కాలుష్యం పెరగడం చాలా సాధారణం. అటువంటి పరిస్థితిలో ఒకవైపు అత్యంత కలుషిత నగరాల జాబితా ప్రతి సంవత్సరం వెలువడుతుండగా.. అదే సమయంలో, గాలి అత్యంత పరిశుభ్రంగా ఉన్న రాష్ట్రాలు, నగరాల గురించి కూడా వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో గాలి నాణ్యత చాలా బాగా ఉన్న రాష్ట్రాల గురించి అదే సమయంలో.. ఇతర ప్రదేశాల్లో వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించ వచ్చో మనం తెలుసుకుందాం..

Air Pollution: మన దేశంలో ఈ రాష్ట్రాల్లో శుభ్రమైన గాలి ఉంది.. ఇతర ప్రదేశాల్లో వాయు కాలుష్యం ఎలా తగ్గించవచ్చంటే..
Air Cleanest CitiesImage Credit source: Unsplash
Surya Kala
|

Updated on: Mar 08, 2025 | 11:08 AM

Share

శీతాకాలంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల గాలి నాణ్యత చాలా దారుణంగా మారుతుంది. పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. చాలా చోట్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశం 2025కి సంబంధించిన నివేదిక శీతాకాలపు పరిసర గాలి నాణ్యత స్నాప్‌షాట్ బయటకు వచ్చింది. ఈ నివేదికలో ఏ రాష్ట్రాల్లో అత్యంత విషపూరితమైన గాలి ఉందో చెప్పడమే కాదు.. దేశంలోని ఏ రాష్ట్రాల్లో అత్యంత పరిశుభ్రమైన గాలి ఉందో , ఈ జాబితాలో ఏ రాష్ట్రాలు చేర్చబడ్డాయో కూడా సమాచారాన్ని అందించింది.

ఈ నివేదిక భారతదేశంలోని 10 అత్యంత కలుషిత నగరాలను కూడా పేర్కొంది. అంతేకాదు కాలుష్యం పెరగడానికి గల కారణాలు, దానిని ఎదుర్కోవడానికి సాధ్యమైన పరిష్కారాల గురించి కూడా నివేదిక మాట్లాడింది. అయితే శీతాకాలంలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో గాలి ఎంత శుభ్రంగా ఉందో.. ఏ నగరంలో అత్యంత పరిశుభ్రమైన గాలి ఉందో తెలుసుకోవడం ముఖ్యం.

ఏ రాష్ట్రాల్లో గాలి అత్యంత పరిశుభ్రంగా ఉందంటే..

కొన్ని రాష్ట్రాలు కాలుష్యంతో సతమతమవుతుండగా.. మిజోరం, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని నగరాల్లో గాలి ఇతర రాష్ట్రాల కంటే శుభ్రంగా ఉంది. మిజోరాంలో అత్యల్ప కాలుష్య నగరం ఐజ్వాల్ అని నివేదిక పేర్కొంది, ఇక్కడ PM2.5 స్థాయి కేవలం 7 µg/m³ గా నమోదైంది. కర్ణాటకలోని చామరాజనగర్ నగరంలో PM2.5 స్థాయి 8 µg/m³గా నమోదైంది. కర్ణాటక కూడా మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మడికేరి నగరం 10 µg/m³ PM2.5 స్థాయితో మూడవ స్థానంలో ఉంది. అంతేకాదు తమిళనాడులోని తిరుపూర్ 11 µg/m³ PM2.5 స్థాయితో నాల్గవ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

గాలిని శుభ్రంగా ఉంచడానికి చిట్కాలు..

దేశ రాజధాని ధిల్లీ బేసి-సరి పథకాన్ని అమలు చేసింది. ఈ సరి-బేసి పథకంతో రోడ్డుపై వాహనాల సంఖ్య తగ్గింది. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. పొగ తగ్గి.. వాయు కాలుష్య సమస్యను తగ్గించవచ్చు.

ఈ పథకం కింద నెలలోని తేదీని బట్టి ఒక రోజు బేసి సంఖ్య గల వాహనాలు (1, 3, 5, 7, 9), మర్నాడు సరి సంఖ్య గల వాహనాలు (2, 4, 6, 8, 0) మాత్రమే రోడ్లపై తిరగగలవు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ కూడా ఆదా అవుతాయి. ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. దీనిని ఖచ్చితంగా అమలు చేసి.. దాని ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తే.. ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిని శుభ్రంగా ఉంచడంలో ఈ సరి బేసి పథకం చాలా సహాయపడుతుంది.

రైతులు గడ్డి తగలబెట్టడానికి మెరుగైన ఎంపిక..

రైతులు గడ్డిని కాల్చడం వల్ల దానిని తొలగించడానికి సులభమైన, చౌకైన మార్గం అనిపించవచ్చు. అయితే అది తీవ్రమైన వాయు కాలుష్యానికి కారణమవుతుంది. రైతులు పంట తర్వాత గడ్డిని కాల్చకుండా ఉండటానికి మంచి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయాలి. అప్పుడు ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చెత్తను ఎరువుగా లేదా ఇంధనంగా మార్చగల సాంకేతికత, యంత్రాలను అందించాలి.

కొన్ని చోట్ల బయోగ్యాస్, బొగ్గుకి ప్రత్యామ్నాయంగా కాగితం మొద్దు నుండి తయారు చేయబడుతున్నాయి, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు ఆర్థిక సహాయం.. సౌకర్యాలు కల్పిస్తే పంట కోతల అనంతరం గడ్డిని అమ్మడానికి లేదా సరిగ్గా ఉపయోగిస్తారు. గడ్డిని కాల్చడానికి బదులుగా..గడ్డిని సరిగ్గా ఉపయోగిస్తారు. దీనివల్ల గాలి శుభ్రంగా ఉంటుంది. పర్యావరణానికి హాని జరగదు.

నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.

నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు గాలిలోకి విషపూరిత పొగను విడుదల చేస్తాయి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. వ్యాధులను పెంచుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు పొగ లేకుండా నడుస్తాయి. పర్యావరణానికి హాని కలిగించవు. ప్రభుత్వం EV లపై సబ్సిడీ ఇస్తే, ఛార్జింగ్ స్టేషన్లను పెంచితే .. దాని ప్రయోజనాలను ప్రజలకు చెబితే, ఎక్కువ మంది వాటిని స్వీకరిస్తారు. కంపెనీలు EVలను తయారు చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. తద్వారా అవి సరసమైన ధరకు, సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. నగరాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు నడిపితే గాలి శుభ్రంగా ఉంటుంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..