AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shasha Yoga: చంద్ర గ్రహణం రోజున ఏర్పడనున్న శశ రాజయోగం.. ఈ మూడు రాశులవారు నెల పాటు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం రోజున కర్మప్రాధాత, న్యాయాధిపతి అయిన శనీశ్వరుడు శశ రాజయోగిని ఏర్పరచబోతున్నాడు. ఈ రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో శశ రాజ యోగంతో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Shasha Yoga: చంద్ర గ్రహణం రోజున ఏర్పడనున్న శశ రాజయోగం.. ఈ మూడు రాశులవారు నెల పాటు పట్టిందల్లా బంగారమే..
Shani Shash Rajyoga
Surya Kala
|

Updated on: Mar 09, 2025 | 10:57 AM

Share

జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణాన్ని ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన సంఘటనగా చూస్తారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 14న సంభవించనుంది. ఈ రోజున రంగుల పండగ హోలీని కూడా జరిపుకోనున్నారు. ఈ సంవత్సరంలో వచ్చే తొలి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనదని జ్యోతిష్యులు అంటున్నారు. ఎందుకంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి పైగా హోలీ పండగ రోజున (మార్చి 14న) చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్ర గ్రహణం రోజున అరుదైన యాదృచ్చికం ఏర్పనుంది.

ఏర్పడనున్న శశ రాజయోగం

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణ రోజున శనీశ్వరుడు రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగాన్ని శశ రాజయోగం అని అంటారు. శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 14న అంటే చంద్రగ్రహణం రోజున.. శనీశ్వరుడు కుంభ రాశిలోనే శశ రాజ్యయోగాన్ని సృష్టిస్తాడు. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం శనీశ్వరుడు సృష్టించే ఈ శశ రాజ యోగం తో పాటు శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని.. ఈ కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై చంద్రగ్రహణం ప్రభావం తగ్గుతుంది.. పైగా వారు అనేక రకాల ప్రయోజనాలను పొందగలరు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేషరాశి:

మేష రాశి రాశుల్లో మొదటి రాశిగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడుతుంది. శనీశ్వరుడు ఏర్పరిచే శశ రాజ్యయోగ ప్రభావం వల్ల మేష రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. శని దేవుడి ఆశీస్సులతో మేష రాశి వ్యాపారవేత్తలు రానున్న ఒక నెలలో తమ వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వీర్ చేపట్టిన ప్రతి పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథున రాశి:

ఈ రాశికి చెందిన వ్యక్తులు శనీశ్వరుడు శశ రాజ్యయోగ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. మిథున రాశి వ్యక్తులు ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో మిథున రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి రానున్న ఒక నెలలో భారీ ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు. వ్యాపారంలో కూడా పురోగతి ఉండవచ్చు. వ్యాపారం పెరగవచ్చు. ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి:

కుంభ రాశి చక్రంలో 11వ రాశిగా పరిగణించబడుతుంది. కుంభ రాశిలో శనీశ్వరుడు శశ రాజ్యయోగాన్ని ఏర్పరచనున్నాడు. అటువంటి పరిస్థితిలో కుంభ రాశి వారు శని దేవుడి ఆశీస్సులతో ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు