AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: స్త్రీలలోని ఈ 6 అలవాట్లుతో ఇంట్లో డబ్బు ఇబ్బందులు, సమస్యలు పెరుగుతాయి.. వెంటనే వదిలించుకోండి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల చెడు అలవాట్లు కూడా కారణం కావొచ్చు. తన జీవితంలో అన్ని నియమాలను విస్మరించి ఆధునికత పేరుతో జీవిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటే, ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అవి తగ్గకపోతే.. మొదట మీరు మీ జీవితంలో దుఃఖానికి, దురదృష్టానికి ప్రధాన కారణమయ్యే అలవాట్లను వెంటనే విడిచి పెట్టాలి.

Vastu Tips: స్త్రీలలోని ఈ 6 అలవాట్లుతో ఇంట్లో డబ్బు ఇబ్బందులు, సమస్యలు పెరుగుతాయి.. వెంటనే వదిలించుకోండి
Vastu Tips
Surya Kala
|

Updated on: Aug 17, 2024 | 12:50 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల చెడు అలవాట్లు కూడా కారణం కావొచ్చు. తన జీవితంలో అన్ని నియమాలను విస్మరించి ఆధునికత పేరుతో జీవిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటే, ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అవి తగ్గకపోతే.. మొదట మీరు మీ జీవితంలో దుఃఖానికి, దురదృష్టానికి ప్రధాన కారణమయ్యే అలవాట్లను వెంటనే విడిచి పెట్టాలి.

నిద్రపోయే అలవాటు

ప్రస్తుతం చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. ఉదయం లేటుగా లేవడం అలవాటు. మీకు కూడా ఈ చెడు అలవాటు ఉంటే మీరు దీన్ని వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే ఇలా చేసేవారు చంద్ర గ్రహానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారు. తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో శరీరం, మనస్సుకి సంబంధించిన ఇబ్బందిని నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్రపోవాలి. అదే సమయంలో ఉదయం సరైన సమయానికి మేల్కొనండి.

ఇంట్లో మొక్కలు ఎండిపోవద్దు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకున్న మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి. రోజూ మొక్కలకు ఎరువులు, నీరు ఇచ్చి సేవ చేయాలి. ఈ నియమాన్ని విస్మరిస్తే ఎండిపోయిన మొక్కలు బుధ గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎండిన మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే ఆ మొక్కను ఇంటి నుండి తీసివేసి.. దాని స్థానంలో కొత్తగా మొక్కను నాటండి.

ఇవి కూడా చదవండి

బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి

బాత్రూమ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంటుందా.. అయితే వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. ఇలా బాత్ రూమ్ శుభ్రంగా లేకపోతే రాహు-కేతువుల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మురికి బాత్రూమ్ కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఆకస్మిక సమస్యలను, అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

సింక్‌లో ఖాళీ పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఖాళీ పాత్రలను ఎప్పుడూ సింక్‌లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయంలో సింక్ లో పాత్రలను ఉంచే వారిపై లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉంటుంది. జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఏర్పడుతుందని విశ్వాసం.

తిన్న తర్వాత ప్లేట్‌ను అక్కడే విడిచి పెట్టవద్దు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత భోజనం చేసిన ప్రదేశంలో పాత్రలను అక్కడే వదిలివేసే వ్యక్తులు చంద్రుడు, శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తిన్న తర్వాత ప్లేట్‌ను తీసివేసి, అందులో చేతులు కడుక్కోకపోతే జీవితంలో రకరకాల మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఉమ్మివేసే విషయంలో కూడా నియమాలు

ఇంట్లో లేదా బయట ఎక్కడ బడితే అక్కడ ఉమ్మి వేసే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఇలాంటి అలవాటు ఉన్నవారు సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా ఉమ్మివేయడం వల్ల జాతకంలో బుధ గ్రహం ప్రభావం చూపుతుంది. బుధ దోషం ఏర్పడితే వ్యక్తి ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది.

బూట్లు, చెప్పులు సరిగ్గా ఉంచండి

ఇంట్లో ఎక్కడబడితే అక్కడ చెప్పులు, బూట్లు విప్పే అలవాటు ఉన్నా లేదా పాదరక్షలు అక్కడ, ఇక్కడ విసిరినట్లు చెల్లాచెదురుగా ఉన్నా.. ఈ చెడు అలవాటు కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో పాదరక్షలకు సంబంధించిన ఈ చెడు అలవాటు కారణంగా వ్యక్తి శని సంబంధిత దోషాలను ఎదుర్కొంటాడు. అటువంటి పరిస్థితిలో బూట్లు, చెప్పులు సరిగ్గా ఉంచండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు