AC Side Effects: సీజన్ తో సంబంధం లేకుండా ఏసీలోనే నిద్రపోతున్నారా.. ఎన్ని వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారో తెలుసా..
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు హటాత్తుగా ఎండలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. దీంతో ఈ సమయంలో వివిధ వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం పెరుగుతుంది. జ్వరం, జలుబు, దగ్గువంటి సీజనల్ వ్యాధుల బారిన పడతారు. అదే సమయంలో దోమలు, వివిధ రకాల వాతావరణం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో పాటు ఏసీ వాడకం వల్ల కూడా ఆరోగ్య సమస్య పెరుగుతోంది.

మారిన కాలంతో పాటు మనవ జీవన శైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. తినే ఆహారంలో, నిద్ర సమయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎక్కువ మంది కాలంతో సంబంధం లేకుండా ఏసీ లేకుండా నిద్ర పోవడం లేదు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. రోజంతా కష్టపడిన శరీరం రాత్రి సమయంలో కొంచెం చలిలో కొంచెం వెచ్చదనంలో హాయిగా నిద్రపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అయితే ఏసీ లేకుండా నిద్రపోని అలవాటు ఉంటే శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసా?
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు హటాత్తుగా ఎండలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. దీంతో ఈ సమయంలో వివిధ వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం పెరుగుతుంది. జ్వరం, జలుబు, దగ్గువంటి సీజనల్ వ్యాధుల బారిన పడతారు. అదే సమయంలో దోమలు, వివిధ రకాల వాతావరణం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో పాటు ఏసీ వాడకం వల్ల కూడా ఆరోగ్య సమస్య పెరుగుతోంది.
రాత్రి సమయంలో కూడా ఏసీ లేకుండా నిద్ర పోని అలవాటు ఉంటే అనేక సమస్యలు ఏర్పడతాయి. ఏసీ పెట్టుకుని నిద్రించడం వల్ల కళ్లు పొడిబారడం సమస్య పెరుగుతుంది. వాతావరణంలోని తేమ కారణంగా చికాకు, మంట కూడా పెరుగుతుంది. తేమలో మార్పులు చర్మ సమస్యలను కలిగిస్తాయి. చాలా మంది వర్షాల వలన దాహం తక్కువ అంటూ తక్కువ నీరు తాగుతారు. ఎందుకంటే నీరు ఎక్కువ నీరు తాగితే రాత్రి సమయంలో పదేపదే లేవవలసి ఉంటుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నిర్జలీకరణం కూడా అలెర్జీలకు, చర్మం పొరలుగా మారడానికి దారితీస్తుంది.
మైగ్రేన్‌తో బాధపడే వారికి ఏసీల చలి అస్సలు మంచిది కాదు. తలనొప్పితో తరచుగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా నిత్యం ఏసీలో ఉంటే మానసికంగా ఇబ్బందులు పడొచ్చు. COPD పేషెంట్ అయినా AC మంచిది కాదు. ACలో చిక్కుకున్న దుమ్ము ఊపిరితిత్తులలో కూడా సమస్యలను కలిగిస్తుంది. అలర్జీలు లేదా ఆస్తమా సమస్య బారిన పడొచ్చు. కుటుంబంలో ఎవరికైనా అంటు వ్యాధి ఉంటే.. అతనితో పాటు AC లో ఒకే గదిలో ఉంటే ఆ వ్యాధి ఇతరులకు సోక వచ్చు. ఈ సీజన్‌లో ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








