IRCTC Tour: ఏకకాలంలో ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాలను తక్కువ ధరకే చూసే అవకాశం.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు మీ కోసం
ప్రతి హిందువు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ జ్యోతిలింగ క్షేత్రాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని చూడాలని శివయ్యకు పూజ చేయాలనుకు తెలుగు వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) జ్యోతిర్లింగ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సరసమైన ధరలకు అందిస్తుంది. ఈ జ్యోతిర్లింగ ప్రత్యేక పర్యటనలో సోమనాథ్ జ్యోతిర్లింగ, మల్లికార్జున జ్యోతిర్లింగ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, బైద్యనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కేదారేశ్వర […]
ప్రతి హిందువు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ జ్యోతిలింగ క్షేత్రాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని చూడాలని శివయ్యకు పూజ చేయాలనుకు తెలుగు వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) జ్యోతిర్లింగ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సరసమైన ధరలకు అందిస్తుంది. ఈ జ్యోతిర్లింగ ప్రత్యేక పర్యటనలో సోమనాథ్ జ్యోతిర్లింగ, మల్లికార్జున జ్యోతిర్లింగ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, బైద్యనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కేదారేశ్వర జ్యోతిర్లింగం, భీమా శంకర జ్యోతిర్లింగం, విశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించవచ్చు. IRCTC వెబ్‌సైట్ ప్రకారం రెండు ప్యాకేజీలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి ఆగస్టులో, మరొకటి సెప్టెంబర్ 2024లో.. ఆగస్టులో IRCTC అందిస్తున్న సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
IRCTC ప్రకారం ఆగస్ట్ ప్యాకేజీలో యాత్రికులు ఔరంగాబాద్, ద్వారక, నాసిక్, పూణే, సోమనాథ, ఉజ్జయినిలలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. ఈ ప్యాకేజీ కింద యాత్రికులు ఉజ్జయిని (మహాకాళేశ్వరం, ఓంకారేశ్వర), ద్వారకా (నాగేశ్వర), సోమనాథ (సోమ్‌నాథ), పూణే (భీమశంకర), నాసిక్ (త్రయంబకేశ్వర), (ఔరంగాబాద్ (ఘృష్ణేశ్వర) క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్రలను కవర్ చేస్తూ 2AC, 3AC లతో పాటు SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో ప్రయాణిస్తారు. 12 రోజులు పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్ జూనియర్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భోంగీర్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్ మరియు పూర్ణలలో బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు ఉన్నాయి.
మొత్తం 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) సీట్లు ఉన్నాయి.
మూడు వర్గాలు ఉన్నాయి: ఎకానమీ (రూ.20590), స్టాండర్డ్ (రూ.33015),
డబుల్/ట్రిపుల్ షేర్ ఆధారంగా కంఫర్ట్ (రూ.43355).
5-11 సంవత్సరాల పిల్లలకు ఛార్జీలు వరుసగా రూ.19255, రూ.31440 , రూ.41465
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..