Swiggy 2025: స్విగ్గీలో హైదరాబాద్ హవా! బిర్యానీ తర్వాత ప్రజలు ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాలు ఇవే!
భాగ్యనగరం మరోసారి తన సత్తా చాటింది! ప్రపంచవ్యాప్తంగా రుచికి పెట్టింది పేరైన హైదరాబాద్ బిర్యానీ, 2025లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ 'స్విగ్గీ' విడుదల చేసిన నివేదిక ప్రకారం, హైదరాబాద్ అప్రతిహత 'బిర్యానీ క్యాపిటల్'గా నిలిచింది. కేవలం ఒక్క ఏడాదిలోనే కోటి డెబ్బై ఐదు లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు రావడం గమనార్హం. అసలు హైదరాబాద్ ప్రజలు ఏయే వంటకాలను ఎక్కువగా ఇష్టపడ్డారు? స్విగ్గీ రిపోర్ట్ వెల్లడించిన షాకింగ్ గణాంకాలివి..

హైదరాబాదీల బిర్యానీ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ 2025లో ఈ ప్రేమ రికార్డుల స్థాయికి చేరింది. స్విగ్గీలో నమోదైన ఆర్డర్ల ప్రకారం, నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ ప్లేట్లు నగరం నలుమూలలకూ డెలివరీ అయ్యాయి. బిర్యానీతో పాటు దోశ, ఇడ్లీల పట్ల కూడా హైదరాబాద్ ప్రజలు తమ మక్కువను ప్రదర్శించారు. మూడు నిమిషాల్లో డెలివరీ అయిన ఫాస్ట్ ఫుడ్ నుండి, లక్షల రూపాయల బిల్లుల వరకు.. 2025 స్విగ్గీ రిపోర్ట్‌లోని ఆసక్తికర విశేషాలు మీకోసం.
బిర్యానీ హవా: హైదరాబాద్‌లో మొత్తం 1.75 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఇందులో 1.08 కోట్ల (61%) ఆర్డర్లతో ‘చికెన్ బిర్యానీ’ అగ్రస్థానంలో నిలిచింది.
దోశ, ఇడ్లీ: బిర్యానీ తర్వాత ప్రజలు అత్యధికంగా ఇష్టపడినవి టిఫిన్లే. దోశకు 39.9 లక్షలు, ఇడ్లీకి 34 లక్షల ఆర్డర్లు వచ్చాయి.
చిరుతిండ్లు & స్వీట్లు: సాయంత్రం వేళల్లో చికెన్ బర్గర్లు (6.8 లక్షలు) టాప్‌లో ఉండగా, స్వీట్లలో బూందీ లడ్డూ (3.3 లక్షలు), చాక్లెట్ కేక్ మరియు గులాబ్ జామూన్లను నగరం తెగ లాగించేసింది.
హెల్త్ ఫ్రీక్స్: ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారిలో కూడా హైదరాబాద్ వెనుకాడలేదు. హై-ప్రోటీన్ ఆర్డర్లలో దేశంలోనే మన నగరం మూడవ స్థానంలో నిలిచింది.
కొన్ని విశేషాలు:
అత్యంత వేగవంతమైన డెలివరీ: చికెన్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ కేవలం 3 నిమిషాల్లో కస్టమర్ ఇంటికి చేరి రికార్డు సృష్టించింది.
భారీ ఆర్డర్లు: ఒకేసారి 42 ప్లేట్ల బిర్యానీ, 13 కాజూ కోడి రోస్ట్ వంటి భారీ ఆర్డర్లను ఒక కస్టమర్ ఇచ్చారు. మరొకరు ఏకంగా 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీల కోసం రూ. 47,106 ఖర్చు చేశారు.
పొదుపు: స్విగ్గీ డైన్ అవుట్ ద్వారా ఒక హైదరాబాదీ కస్టమర్ సింగిల్ బుకింగ్‌పై రూ. 1,17,905 ఆదా చేయడం విశేషం.
