Kannayya Kalyanam: కన్నుల పండువగా వేణుగోపాల స్వామి కళ్యాణం.. దేవేరులతో కలిసి గజవాహనంపై ఊరేగిన కన్నయ్య
కన్నయ్యను పెళ్లి కుమారుడిగా.. రుక్మిణి దేవి, సత్యభామలను పెళ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి గజ వాహనంపై ఊరేగగా.. గ్రామోత్సవం జరిపించారు. అనంతరం రాత్రి మండపం వద్ద వేదమంత్రాలతో కళ్యాణ క్రతువుని నిర్వహించారు. విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం లగ్నాష్టకం చూర్ణిక మహా సంకల్పం తదితర వేదమంత్రాలతో మాంగల్య ధారణ గావించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న స్వయంభు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి వేణుగోపాల స్వామి మహిళా భక్త సమాజం వారిచే కన్నయ్యను పెళ్లి కుమారుడిగా.. రుక్మిణి దేవి, సత్యభామలను పెళ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి గజ వాహనంపై ఊరేగగా.. గ్రామోత్సవం జరిపించారు. అనంతరం రాత్రి మండపం వద్ద వేదమంత్రాలతో కళ్యాణ క్రతువుని నిర్వహించారు. విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం లగ్నాష్టకం చూర్ణిక మహా సంకల్పం తదితర వేదమంత్రాలతో మాంగల్య ధారణ గావించారు.
ఆలయ కార్య నిర్వహణ అధికారి సిహెచ్ వి రమణ మూర్తి పట్టు వస్త్రాలు సమర్పించగా అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని తిలకించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణాన్ని యాగ్నిక బ్రహ్మ సుదర్శనం మాధవ మణికంఠచార్యులు ఆలయ అర్చకులు జయ జనార్ధన ఆచార్యులు వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవ సమితి సభ్యులు ఘనంగా జరిపించారు. కళ్యాణం లో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ ధర్మకర్తలు మల్యాల వంశస్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..