Kaal Bhairav Jayanti: మృత్యు భయం తొలగడానికి కాలభైరవ జయంతిన పూజా విధానం, శుభ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
కాల భైరవ జయంతి శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనది. శివుని ఉగ్ర రూపం కాల భైరవుడిని అవతారం అని భావించి పూజిస్తారు. కాల భైరవుడిని ఆరాధించడం వల్ల శారీరక వ్యాధులు, బాధల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. కాలభైరవుడిని పూజించడం వల్ల మృత్యుభయం నుంచి ఉపశమనం లభిస్తుంది. భగవంతుడు కాలభైరవుడు భక్తులను మృత్యు భయం నుండి రక్షిస్తాడని విశ్వాసం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అష్టమి తిథి నాడు నెలవారీ కాలాష్టమి వ్రతం పాటిస్తారు. ఈ సంవత్సరం కాలభైరవ జయంతి 5 డిసెంబర్ 2023 న జరుపుకోనున్నారు. ఈ రోజున కాలభైరవుడు అవతరించినట్లు నమ్ముతారు. భైరవుడు శివుని ఉగ్రరూపంగా వర్ణించబడ్డాడు. ఈ రోజున శివుని ఉగ్రరూపం అని పిలువబడే కాల భైరవుడిని నియమ నిష్టలతో పూజిస్తారు.
కాల భైరవుడు దయగలవాడు, పూజ, పత్రంతో మెప్పించవచ్చని విశ్వాసం. అయితే అనైతిక చర్యలకు పాల్పడే వారిని శిక్షించే దైవంగా పరిగణించబడుతున్నాడు. అంతేకాదు మాత్రమే కాదు.. కాల భైరవుని భక్తులకు ఎవరైనా ఏదైనా హాని చేస్తే.. వారిని విడిచి పెట్టడు అనే నమ్మకం కూడా ఉంది.
కాలభైరవ జయంతి ప్రాముఖ్యత?
కాల భైరవ జయంతి శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనది. శివుని ఉగ్ర రూపం కాల భైరవుడిని అవతారం అని భావించి పూజిస్తారు. కాల భైరవుడిని ఆరాధించడం వల్ల శారీరక వ్యాధులు, బాధల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. కాలభైరవుడిని పూజించడం వల్ల మృత్యుభయం నుంచి ఉపశమనం లభిస్తుంది. భగవంతుడు కాలభైరవుడు భక్తులను మృత్యు భయం నుండి రక్షిస్తాడని విశ్వాసం. హిందూ మతంలో కాలభైరవుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడి ఆరాధకులుకాలభైరవుడి జయంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
కాల భైరవ జయంతి శుభ సమయం
కాల భైరవ జయంతిని కాలాష్టమి అని కూడా అంటారు. కాల భైరవ జయంతి కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు వస్తుంది. ఈ అష్టమి తిథి డిసెంబర్ 4, 2023 ఉదయం 9:59 గంటలకు ప్రారంభమై మర్నాడు డిసెంబర్ 5న అర్ధరాత్రి 12:37 గంటలకు ముగుస్తుంది.
కాల భైరవ జయంతి పూజా విధానం
- కాల భైరవ అష్టమి తిథి రోజున ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, ఉపవాసం దీక్షను చేపట్టాలి.
- తర్వాత దీపం వెలిగించి శివుడిని పూజించాలి.
- కాల భైరవుడిని రాత్రిపూట పూజించాలని నమ్ముతారు.
- కాల భైరవ అష్టమి రోజున ఆలయానికి వెళ్లి భైరవుని ముందు నాలుగు ముఖాల దీపం వెలిగించండి.
- భైరవుడికి పూలు, మిఠాయి, తమలపాకులు, కొబ్బరి చలిమిడి, వడపప్పు మొదలైనవి సమర్పించండి.
- కాల భైరవుని ముందు ఆసనం మీద కూర్చుని, శ్రీ భైరవ చాలీసాను పఠించండి. పూజ పూర్తయిన తర్వాత కాల భైరవునికి హారతిని ఇవ్వాలి. హారతి ఇచ్చిన అనంతరం కాలభైరవ స్వామిని తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరాలి.
- కాల భైరవుడిని ఆరాధించే వారు నిర్మల హృదయంతో ఉండాలి. శివుడిని కాలభైరవస్వామిగా భావించి పూజిస్తే ప్రతి కోరికను తీరుస్తాడని విశ్వాసం.
- కాలభైరవుడు జీవితంలో ఎదురైనా సమస్యలు, భయాన్ని, వ్యాధులను తొలగిస్తాడని విశ్వాసం.
- కాలభైరవుని వాహనం కుక్క. కనుక కాలభైరవ జయంతి రోజున భైరవుడిని పూజించడంతో పాటు కుక్కలకు ఆహారాన్ని అందించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు