చలికాలంలో లవంగాలతో అద్భుత ప్రయోజనాలు.. తింటే ఆ వ్యాధులకు చెక్!

Samatha

10 January 2026

లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటున్నారు నిపుణులు.

ఆరోగ్యానికి మంచిది

చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో లవంగాలు తినడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

రోగనిరోధక శక్తి

ముఖ్యంగా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం చలికాలంలో లవంగాలు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

శరీరానికి వెచ్చదనం

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని చలికాలంలో తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

జీర్ణక్రియ 

అదే విధంగా చలికాలంలో లవంగాలను నమలడం వలన ఇది పంటి నొప్పిని తగ్గించడమే కాకుండా, నోటి దుర్వాసనను కూడా తొలిగిస్తుందంటున్నారు నిపుణులు.

పంటి నొప్పి, నోటి దుర్వాసన

చలికాలంలో లవంగాలు తినడం వలన ఇది దగ్గు, కఫం, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది శ్వాస కోశ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

జలుబు, దగ్గు

రక్తంలో చక్కెర స్థాయలను తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను తినడం వలన ఇది సులభంగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు

లవంగాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. వీటిని తీసుకోవడం వలన శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చలి నుంచి ఉపశమనం కలుగుతుంది.

శరీరానికి వెచ్చదనం