Sudden Rains: అకాల వర్షం అపార నష్టం.. తడిచిపోయిన ధాన్యం.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు

అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు కలవరపడుతున్నారు. భారీ వర్షం ధాటికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. ఇక రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలిపింది.

Sudden Rains: అకాల వర్షం అపార నష్టం.. తడిచిపోయిన ధాన్యం.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు
Farmers Hardships
Follow us

|

Updated on: Nov 25, 2023 | 7:10 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులను అకాల వర్షం నిండా ముంచుతోంది. నిన్నటి దాకా సాగు నీటి కోసం తండ్లాడిన రైతులు.. ఎలాగోలా పంటలు పండించారు. అయితే ఇప్పుడు అకాల వర్షంతో రైతులకు అపార నష్టం కలగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం.. బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు వడ్ల కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిష్టంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్‌లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం అరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించి.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షం ధాటికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు.

రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈనెల 27న తీవ్ర అల్పపీడనం ఏర్పడి రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు తమిళనాడును కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. కొండ చరియలు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడడడంతో.. నీలగిరి కొండలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో టీ ఎస్టేట్స్‌, అటవీ గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..