Vizag Fishing Harbour: బోటు నుంచి వచ్చిన ఆ ఇద్దరు ఎవరు..? విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో కీలక ఆధారాలు స్వాధీనం.. వీడియో

Visakha Fishing Harbour Fire Accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఇదొక పెను ప్రమాదంగా మిగిలింది.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 25, 2023 | 10:07 AM

Visakha Fishing Harbour Fire Accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఇదొక పెను ప్రమాదంగా మిగిలిపోయింది. కాగా.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సీసీ ఫుటేజ్‌ సేకరించారు పోలీసులు. ఆ ఫుటేజ్‌లో ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు ప్రమాదం జరిగిన బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చారు.

19తేదీ రాత్రి 10:48కి బోటు నుంచి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు బయటికి రాగా.. అదే రాత్రి 10.50కి బోటులో మంటలు చేలరేగాయి. దీంతో ప్రమాద ఘటనతో ఆ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉంటుందనే కోణాంలో విచారిస్తున్నారు పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులనే గుర్తించే పనిలో పడ్డారు సీసీ ఫుటేజ్‌తో కేసు మొత్తం మరో మలుపు తిరిగింది.

అంతకుముందు యూట్యూబర్ నాని.. పలువురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు మరికొన్ని కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..