Andhra Pradesh: కాలేజ్ మారినా ప్రేమించమని వెంటాడి వేధించాడు.. చివరకు పోలీసులకు చేతికి చిక్కాడు

ఇంటర్ లో వేరు వేరు చోట్ల చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ తారసపడలేదు. అయితే ఆ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం ఒంగోలులోని క్విజ్ కాలేజ్ లో చేరింది. ఈ విషయం ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న స్నేహితుల ద్వారా దుర్గా ప్రసాద్ కు తెలిసింది. ఆమె నంబర్ సేకరించి అప్పటి నుండి తిరిగి ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఆ యువతి మాత్రం ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు.

Andhra Pradesh: కాలేజ్ మారినా ప్రేమించమని వెంటాడి వేధించాడు.. చివరకు పోలీసులకు చేతికి చిక్కాడు
Andhra Pradesh
Follow us

| Edited By: Surya Kala

Updated on: Nov 14, 2023 | 1:19 PM

ప్రేమించమని వెంటపడటం.. ప్రేమించను అన్నందుకు కత్తులతో దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పదవ తరగతిలో చిగురించిన ప్రేమ బిటెక్ కు వచ్చిన తర్వాత ప్రపోజ్ చేసే స్థాయికి వచ్చింది. అయితే  ఆ యువతి మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అటు వంటి ఉద్దేశం లేదని చెప్పడంతోనే ప్రియుడు కత్తితో దాడి చేశాడు. అసలేం జరిగిందంటే..

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రు వారిపాలెంకు చెందిన విద్యార్ధిని విజయవాడలో ఆరు నుండి పదవ తరగతి వరకూ చదువుకుంది. అక్కడ తనతో పాటు చదువుకున్న దుర్గా ప్రసాద్ పదవ తరగతిలో పరిచయం అయ్యాడు. అప్పుడే ప్రేమించానంటూ చెప్పడంతో ఆ విద్యార్ధిని వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ విషయం ఇద్దరూ మరిచిపోయారు.

ఇంటర్ లో వేరు వేరు చోట్ల చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ తారసపడలేదు. అయితే ఆ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం ఒంగోలులోని క్విజ్ కాలేజ్ లో చేరింది. ఈ విషయం ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న స్నేహితుల ద్వారా దుర్గా ప్రసాద్ కు తెలిసింది. ఆమె నంబర్ సేకరించి అప్పటి నుండి తిరిగి ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ యువతి మాత్రం ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు. తన వెంట పడవద్దని హెచ్చరిస్తూనే ఉంది. ఇంటర్ తోనే చదువు ఆపేసిన దుర్గా ప్రసాద్ .. దీపావళి సెలవుల్లో ఆ యువతి స్వగ్రామమైన ముండ్రువారి పాలెం వెళ్లినట్లు తెలుసుకున్నాడు.

విజయవాడ నుండి ఆ యువతి స్వగ్రామానికి వెళ్లాడు. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లాడు. బయట నిలబడి ఆమెను పిలిచాడు. దీంతో ఎవరా పిలుస్తుందని ఆ యువతి బయటకు వచ్చింది. వెంటనే అతను తన వద్ద నున్న కత్తిని ఆమె మెడ మీద పెట్టి కోసేశాడు.  ఆ యువతి కేకలు వేయడంతో ఇంట్లోని నుండి వచ్చిన బంధువులు దుర్గా ప్రసాద్ ను పట్టుకున్నారు.

కత్తితో దాడి చేయడంతో ఆ యువతికి గాయమయింది. వెంటనే ఆమెను వినుకొండలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయువకుడిని శావల్యాపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు
ఘాజియా తీరలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు.. 14 మందికి గాయాలు
ఘాజియా తీరలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు.. 14 మందికి గాయాలు
ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకుల్లో ఏకంగా 8.5శాతం..
ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకుల్లో ఏకంగా 8.5శాతం..