Kerala: తాతపై ప్రేమతో కారుకి ఎదురెళ్లి .. ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారి బాలుడు..

తాతా మనవళ్ల బంధం చూసి అసలు కంటే వడ్డీ ముద్దు అంటూ ఉంటారు. తన పిల్లల కంటే మనవళ్ల పట్ల  అత్యంత ప్రేమని పెంచుకుంటారు. అదే విధంగా మనవాళ్లకు, మానవరాళ్లు కూడా తమ తాతా బామ్మల పట్ల అంతే ప్రేమగా ఇష్టంగా ఉంటారు. తమ ఇంటికి వస్తున్న తాతను చూస్తే.. ఎంత దూరంలో ఉన్నా బుడి బుడి అడుగులతో నైనా పరుగులు పెడతారు.. ఇలాంటి ప్రేమ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది.

Kerala: తాతపై ప్రేమతో కారుకి ఎదురెళ్లి .. ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారి బాలుడు..
Kerala Toddler Dies
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2023 | 12:39 PM

కేరళలో జరిగిన ఓ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రాష్ట్రంలోని కాసరగోడ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాత కారు పార్క్ చేస్తుండగా ఆ కారు కింద ఒక పసిబిడ్డ నుజ్జునుజ్జు అయ్యాడు. తాత కారుని చూసి చిన్నారి పరుగెత్తడంతో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆలయంగా ఈ ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 10న ఈ ఘటన జరగగా .. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మృతుడు రెండున్న ఏళ్ల వయసున్న మస్తుల్ జిషాన్‌గా గుర్తించారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు చిన్నారులు ఇంటి ఆవరణ ముందు ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక కారు ఇంటి ఆవరణ లోపలికి వస్తోంది. ఇది చూసి ఒక బాలుడు దూరంగా పరిగెత్తాడు.. అయితే అదే సమయంలో ఆ ఇద్దరి చిన్నారుల్లో రెండున్నర ఏళ్ల వయసున్న మస్తుల్ తాతని గుర్తించి బుడి బుడి అడుగులతో కారుకు ఎదురు వెళ్ళాడు. అయితే మనవడు తనకోసం కారుకి ఎదురు వస్తున్న విషయాన్నీ కారు పార్కింగ్ చేస్తున్న తాత గమనించలేదు. కారుని పార్క్ చేసేందుకు స్టీరింగ్ ను పక్కకు తిప్పాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న చిన్నారి బాలుడు కారు టైర్ కింద పడి నలిగిపోయాడు. ఈ ఘటనను తాత కారుకి దారి ఇవ్వడం కోసం పక్కకు జరిగిన మరో బాలుడు గుర్తించాడు. పెద్దగా అరిచాడు. అప్పుడు తాత ఏదో జరిగిందంటూ గబగబా కారు కిందకు దిగాడు.

అప్పటికే కారుకింద ఉన్న బాలుడిని బయటకు తీశాడు బాలుడు.. కారుదిగిన తాత .. తన కారు కింద పడి నలిగిపోయిన మనవడిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. గబగబా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందాడు. ఈ ప్రమాద దృశ్యం ఆ ఇంటి సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..