Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య తీర్థయాత్ర

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన హామీ ఇచ్చారు. మధ్య ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ అయోధ్యలోని రామమందిరం దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. విదిశా జిల్లాలోని సిరోంజ్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు.

Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య తీర్థయాత్ర
Union Home Minister Amit Shah criticizes all the parties in Telangana in BJP Jangaon Sabha
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 14, 2023 | 12:45 PM

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన హామీ ఇచ్చారు. మధ్య ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ అయోధ్యలోని రామమందిరం. దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. విదిశా జిల్లాలోని సిరోంజ్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు తమ కొడుకులు, కూతుళ్ల సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రామమందిర నిర్మాణం గురించి పట్టించుకోలేదని విరుచుపడ్డారు.

రామ మందిరం నిర్మాణం కోసం దేశ ప్ర. లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, అయోధ్యలో రామమందిర నిర్మాణ పోరాటం 500 ఏళ్ల నుంచి జరుగుతుందని గుర్తు చేశారు. దీని కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నామన్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ రామాలయానికి భూమిపూజ చేశారనన్నారు. చుక్క రక్తం చిందించకుండా, రామాలయ భూమి పూజ చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. జనవరి 2024 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందన్న అమిత్ షా.. జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని స్పష్టం చేశారు అమిత్ షా.

కొత్తగా నిర్మించిన రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికి అయోధ్యను ఉచితంగా సందర్శించడానికి మధ్య ప్రదేశ్ వాసులకు అవకాశం కల్పిస్తామన్నారు అమిత్ షా. రాష్ట్ర ప్రజల తరుఫున బీజేపీ సర్కార్ డబ్బు ఖర్చు భరిస్తుందని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరిగా అయోధ్యలో శ్రీరాముని దర్శనం కోసం క్రమంగా ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

అలాగే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఘాటుగా స్పందించారు అమిత్ షా. సొంత హామీ లేని వారి హామీ ఏమిటి? మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పదేళ్ల హయాంలో మధ్యప్రదేశ్‌కు రూ.2 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎంపీలకు రూ.6.35 లక్షల కోట్లు ఇచ్చిందని, వివిధ పథకాల కింద రూ.5 లక్షల కోట్లు అదనంగా అందించామని షా గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్‌లో 93 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున రూ.21,000 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయన్న అమిత్ షా.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు పెంచుతామన్నారు అమిత్ షా. అలాగే, రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని అమిత్ షా చెప్పారు. ఒకవైపు వంశపారంపర్య పార్టీ కాంగ్రెస్ ఉండగా, మరోవైపు దేశాన్ని కాపాడేందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఉందని ఆయన అన్నారు.

2003లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు, మధ్యప్రదేశ్‌ను “మిస్టర్ బంటధర్ దిగ్విజయ సింగ్” నాయకత్వం వహించారు. అతను తన 10 సంవత్సరాల పాలనలో మధ్యప్రదేశ్‌ను వెనుకబడిన రాష్ట్రంగా మార్చారని కేంద్ర మంత్రి విమర్శించారు. బీజేపీ 18 ఏళ్ల ఎంపీపీలో అధికారంలో వచ్చాక, రాష్ట్రాన్ని బీమారు హోదా నుంచి తప్పించి బేమిసల్ మధ్యప్రదేశ్‌గా మార్చిందన్నారు. వచ్చే ఐదేళ్లలో బీజేపీ మధ్యప్రదేశ్‌ను ‘బెమిసల్’ నుంచి బెస్ట్‌గా మారుస్తుందని ఆయన అన్నారు.

ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ తమ కుమారులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ బాబా ప్రధాని కావాలని కోరుకుంటున్నారని షా పేర్కొన్నారు. కొడుకులు, కూతుళ్ల కోసం రాజకీయాల్లో ఉన్నవాళ్లు మధ్యప్రదేశ్‌కు, దేశానికి మేలు చేయగలరా.. అని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ను హయాంలో మధ్యప్రదేశ్ బడ్జెట్రూ. 23,000 కోట్లుగా ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం రూ. 3.14 లక్షల కోట్లకు పెంచిందని షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సరైన చర్య కాదని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశాన్ని ఒకటిగా ప్రధాని మోదీ చేర్చారని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…