Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jalakandeswarar Temple: వివాదంలో 5 వందల ఏళ్ల నాటి ఆలయం.. రహస్య గదుల స్వాధీనానికి పురావస్తు శాఖ ప్రయత్నం.

చిదంబరం లోని నటరాజ స్వామి ఆలయంలో దీక్షితుల వర్గం వివాదం మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వం, ట్రస్టు అధ్య వివాదం నడుస్తోంది. ఆలయం వేలూరు ఫోర్ట్ ప్రాంగణంలో ఉంటుంది. ఆలయం లోపల కొన్ని గదులు ఉన్నాయి.. భక్తులకు ప్రవేశం లేని ఈ గదులను రహస్య గదులుగా పిలుస్తారు. గదుల్లో ఆలయానికి సంబంధించిన విలువైన సంపద అక్కడే దాచుతారు.

Jalakandeswarar Temple: వివాదంలో 5 వందల ఏళ్ల నాటి ఆలయం.. రహస్య గదుల స్వాధీనానికి పురావస్తు శాఖ ప్రయత్నం.
Vellore Jalakandeswarar Tem
Follow us
Ch Murali

| Edited By: Surya Kala

Updated on: Nov 07, 2023 | 1:52 PM

తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నన్ని భారీ నిర్మాణాలతో కూడిన ఆలయాలు మరెక్కడా లేవు. అలాంటి  దేవాలయాల్లో ఒకటి  తమిళనడులోని వెల్లూరులో ఉన్న జలకండేశ్వర ఆలయం. ఇపుడు ఈ ఆలయం కేంద్రంగా వివాదం నెలకొంది. క్రీ.శ 1550 లో విజయ నగర రాజుల పాలన సమయంలో స్వయంభువు వెలసిన శివలింగం ఉండేది. ఆ సమయంలో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. శివలింగం ఉన్న ప్రాంతం నీటితో నిండి ఉండడంతో ఆలయం జలకండేశ్వర ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఆలయం పురావస్తు శాఖ అధికారులు ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

1981లో ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని భావించినా పురావస్తు శాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో రహస్యంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. భక్తుల మనోభావాల దృష్ట్యా వివాదానికి కారణమవుతుందని అప్పట్లో పురావస్తు శాఖ పట్టించుకోలేదు. అప్పటి నుంచి జలకండేశ్వర ధర్మ స్థాపన అనే ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయం నిర్వహణ జరుగుతూ వస్తోంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేలా కోర్టు ద్వారా అనుమతి కోరింది. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చినా ఆలయం నిర్వహణ చూస్తున్న జలకండేశ్వర ధర్మ స్థాపన ట్రస్టు సభ్యులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

చిదంబరం లోని నటరాజ స్వామి ఆలయంలో దీక్షితుల వర్గం వివాదం మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వం, ట్రస్టు అధ్య వివాదం నడుస్తోంది. ఆలయం వేలూరు ఫోర్ట్ ప్రాంగణంలో ఉంటుంది. ఆలయం లోపల కొన్ని గదులు ఉన్నాయి.. భక్తులకు ప్రవేశం లేని ఈ గదులను రహస్య గదులుగా పిలుస్తారు. గదుల్లో ఆలయానికి సంబంధించిన విలువైన సంపద అక్కడే దాచుతారు. ఈ గదులను స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం పురావస్తు శాఖ అధికారులు బృందం ఆలయంలోకి వెళ్ళింది.

ఇవి కూడా చదవండి

అధికారులకు జలకండేశ్వర ధర్మ స్థాపన ట్రస్టు సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్వాధీనం కోసం వెళ్లిన అధికారుల బృందాన్ని సభ్యులు నిర్బంధించారు. సోమవారం ఉదయం వరకు అధికారులు తిరిగి రాకపోవడంతో సిబ్బంది పోలీసులను ఆశ్రయించడంతో ఆలయానికి వెళ్లిన పోలీసులు అధికారులను బయటకు తీసుకు వచ్చారు. అయితే భక్తుల మనోభావలను దెబ్బతీస్తున్నారంటూ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ట్రస్టుకు మద్దతుగా హిందూ సంఘాలు నిలిచాయి. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే ఆలయం కాకుండా గదుల జోలికి పురావస్తు శాఖ ఎందుకు వెళ్ళింది అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ గదుల్లో విలువైన సంపద ఉంది.. సంపద కోసమే అధికారులు స్వాధీనానికి వెళ్లారని అంటుంటే ముందుగా గదులను తమ ఆధీనంలోకి తీసుకుని ఆ తర్వాత ట్రస్టు అధికారులను కూడా లేకుండా చేసేందుకే పురావస్తు శాఖ ప్రయత్నిస్తోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..