AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Micro Arts: సూక్ష్మ కళలో దిట్ట.. బలపంపై విరాట్ ఫోటో.. డ్రాయింగ్ టీచర్ అద్భుత ప్రతిభ

దక్షిణాఫ్రికాపై తన బర్త్ డే రోజు 49వ సెంచరీ చేసి సచిన్ టెండుల్కర్ రికార్డులు సమం చేసిన విరాట్ కోహ్లీ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా వాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. క్రికెట్ లో ప్రపంచ దేశాలలో భారత్ కీర్తి ప్రతిష్టలను చాటుతున్న విరాట్ కోహ్లీ చిత్రాన్ని బలపంపై చక్కగా చిత్రించాడు.

J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Nov 07, 2023 | 1:20 PM

Share
తన సూక్ష్మ కళను ప్రదర్శించి భళా అనిపించుకున్నాడు టీచర్. ఒక్క విరాట్ కోహ్లీదే కాదు ఎన్నో అద్భుతాలను సృష్టించిన మల్లికార్జున గురించి తప్పక తెలుసుకోవాలి. తన ప్రతిభతో సర్వత్రా ప్రశంసలను అందుకుంటున్నాడు ఈ కళాకారుడు.  

1 / 6
కర్నూల్ జిల్లా ఆదోని పట్టణానికి చెందిన మల్లికార్జున కమ్మరచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఔట్సోర్సింగ్ కింద డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సూక్ష్మ కళల్లో దిట్ట.. బలపంపై క్రికెటర్ విరాట్ కోహ్లీ చిత్రపటాన్ని చిక్కాడు. 

2 / 6
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదినాన్ని పురస్కరించుకొని విరాట్ కోహ్లీ చిత్రపటాన్ని తన సూక్ష్మ కళా పై పదును పెట్టి బలపంపై చెక్కి భళా అనిపించుకున్నాడు. ఆదివారం ఆయన దాదాపుగా గంటన్నర పాటు కష్టపడి విరాట్ కోహ్లీ సూక్ష్మ చిత్రాన్ని బలపంపై చెక్కారు.

3 / 6
ఇవే కాకుండా నందమూరి తారక రామారావు ముఖచిత్రాన్ని వేశారు. వేపాకుపై ఎన్టీఆర్ చిత్రం చూస్తే.. ఔరా అనాల్సిందే.. సూక్ష్మ కళతో అద్భుతమైన చిత్రాలను గీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆదోని కి చెందిన మల్లికార్జున. ఎన్టీఆర్ శత దినోత్సవం సందర్భంగా వేపాకుపై ఎన్టీఆర్ చిత్రాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించుకున్నాడు.

4 / 6
రంజాన్ పండగను పురస్కరించుకుని మాస్టర్ మల్లికార్జున రాయిపై మక్కా మదీనా చిత్రాన్ని చక్కగా చిత్రీకరించాడు. సూక్ష్మ చిత్రకళా రూపంగా అనేక చిత్రాలను పెయింట్ వేశాడు. 

5 / 6
 ఏ వేడుకైనా.. ఏ విధమైనఆకృతులనైనా చాక్ పీస్, గులకరాయి, ఆకులపై చిత్రీకరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చరిత్ర కలిగిన చిత్రాలను ప్రముఖుల వ్యక్తులు, చారిత్రక కట్టడాలు, దేవుళ్ళ చిత్రాలను గీస్తూ తనకంటూ గుర్తింపుని తెచ్చుకొని అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. చిన్నప్పటినుండి ఆర్ట్స్ పై మక్కువతో ఈ విద్య నేర్చుకున్నానని మల్లికార్జున చెప్పాడు. 

6 / 6