త్రిష..దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిష ఇప్పుడు హిస్టరీని తిరగరాస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. గ్లామర్స్ రోల్స్ మాత్రమే కాదు.. ఓరియెంటెడ్ పాత్రల వరకు అన్ని రకాల పాత్రలలో నటించింది. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఉండటం కచ్చితంగా అదృష్టం కాదు.. ఆమె కష్టానికి ఫలితం దక్కిందని అభిమానులు కొనియాడుతున్నారు.