- Telugu News Photo Gallery Cinema photos Tamannah Bhatia Kriti Shetty Anushka Shetty going into Mollywood films will it work out for them
Anushka Shetty: కేరళ బాట పడుతున్న ముద్దుగుమ్మలు.. అనుష్క లేడీ లక్ మలయాళం లో అవుతుందా ??
పనిచేయాలనే ఉద్దేశం ఉండాలే గానీ, అవకాశాలకు కొదవేం లేదిప్పుడు. అయితే నార్త్, అదీ లేకుంటే సౌత్, రిలీజ్ అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు... అబ్బో... ఛాన్సులు చాలానే ఉన్నాయి. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరూ అలాంటి ఛాన్సులనే పట్టేస్తున్నారు. లేడీ లక్ అనుష్క శెట్టి త్వరలోనే మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకు ముందు ఆమె నటించిన సినిమాలు మలయాళంలో రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆమె మలయాళంలో కథనార్‌లో నటించడానికి యాక్సెప్ట్ చేశారు.
Updated on: Nov 07, 2023 | 6:53 PM

పనిచేయాలనే ఉద్దేశం ఉండాలే గానీ, అవకాశాలకు కొదవేం లేదిప్పుడు. అయితే నార్త్, అదీ లేకుంటే సౌత్, రిలీజ్ అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు... అబ్బో... ఛాన్సులు చాలానే ఉన్నాయి. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరూ అలాంటి ఛాన్సులనే పట్టేస్తున్నారు.

లేడీ లక్ అనుష్క శెట్టి త్వరలోనే మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకు ముందు ఆమె నటించిన సినిమాలు మలయాళంలో రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆమె మలయాళంలో కథనార్‌లో నటించడానికి యాక్సెప్ట్ చేశారు. సినిమాలన్నీ ప్యాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ తరుణంగా కేరళలో హారర్ థ్రిల్లర్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉందని అంటున్నారట స్వీటీ.

వా నువ్వు కావాలయ్యా అంటూ స్టెప్పులేసిన తమన్నా చేతినిండా సినిమాలున్నాయి. సినిమాలు, వెబ్‌సీరీస్‌లు అంటూ మళ్లీ ఫుల్ బిజీ అయిపోయారు మిల్కీ బ్యూటీ. ఇంత బిజీలోనూ ఇటీవల ఆమె బాంద్రా అనే మలయాళ సినిమాకు సైన్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది బాంద్రా. ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ సినిమా ఉప్పెన విడుదలకు ముందే అవకాశాలు ఉప్పెనలా ముంచెత్తాయి కృతి శెట్టిని. తెలుగు, తమిళంలో చాలా సినిమాలే చేశారు కృతి. ఇప్పుడు మలయాళంలో అజయంటే రెండం మోషణం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మలయాళ టాప్ స్టార్ టొవినో థామస్ తో కృతి జోడీ కడుతున్నారనే వార్త ఈ బ్యూటీ అభిమానులకు ఎగ్జయిటింగ్‌గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.




