2024 Summer Films: 2024 సమ్మర్ బరిలో ఎవరు దిగనున్నారు.. దేవరకి సరి తూగే పోటీనే లేదా..
సినిమాలన్నీ సంక్రాంతికి పోటీ పడితే, సమ్మర్‌లో సందడి చేయడానికి ఏం ఉన్నాయి? అందరికీ తారక్ దేవరగా కనిపిస్తున్నాడు. ఆ నెక్స్ట్ ఎవరు? మెగాస్టార్, గాడ్ ఆఫ్ మాసెస్ ఊసెక్కడ? మాస్ మహరాజ్ ఏమైనా దిగుతారా? ఇలాంటివన్నీ ఇప్పుడు జనాల్లో ఆసక్తి పెంచుతున్న విషయాలు. రామ్ పోతినేని, బాలయ్య, డార్లింగ్ వారి చిత్రలతో దేవరతో పోటీ పడనున్నారా.. లేదా.. తెలుసుకుందాం.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Nov 07, 2023 | 10:06 AM

2024లో సమ్మర్‌ని కాసింత ఎర్లీగానే స్టార్ట్ చేస్తామని అంటున్నారు ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని. డబుల్ ఇస్మార్ట్ ని మార్చిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు రామ్ అండ్ పూరి.

ఆల్రెడీ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో సక్సెస్ అందుకున్న బాలయ్య కూడా నెక్స్ట్ మార్చి మీదే ఫోకస్ చేశారు. బాబీ డైరక్షన్‌లో చేస్తున్న మూవీని మార్చిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు నట సింహం బాలయ్య.

2024 సంక్రాంతికి కల్కిని తీసుకురావడం పక్కా అని గతంలో చెప్పారు మేకర్స్. కానీ ప్రభాస్ కల్కి 2024 సంక్రాంతి నుంచి స్కిప్ అయింది. మరి సమ్మర్‌లో ల్యాండ్ అవుతుందో లేదో ఇప్పటికయితే క్లారిటీ లేదు.

ఆల్రెడీ ఈ ఏడాది కలిసి హిట్ కొట్టిన మెగాస్టార్, మాస్ మహరాజ్ వచ్చే సమ్మర్‌కి తమ సినిమాలను బరిలోకి దించుతారా? లేదా? అనేది సస్పెన్స్. సెట్స్ మీదున్న సినిమాల్లో ఒక్కదాన్నైనా పవన్ సమ్మర్ గిఫ్ట్ గా ఇస్తారో లేదోననే ఎదురుచూపులు కూడా ఉన్నాయి ఫ్యాన్స్ లో.

ఇప్పటికైతే పక్కాగా సమ్మర్ మీద ఖర్చీఫ్ వేసుకున్న తెలుగు సినిమా దేవర మాత్రమే. మరి సమ్మర్ దగ్గరికొచ్చేసరికి దేవరకు పోటీగా మరెన్ని సినిమాలు కాలు దువ్వుతాయో వేచి చూడాల్సిందే.





























