- Telugu News Photo Gallery Cinema photos Venkatesh offered the young director to make a film with him
Venkatesh: యంగ్ డైరక్టర్‌కి ఓపెన్ ఆఫర్ .. తనకు కూడా స్క్రిప్ట్ చేయమని అడిగిన వెంకీ..
ఎంత సెలబ్రిటీలైనా స్టార్ హీరోల దగ్గరకి వెళ్లడానికి యాక్సెస్ అంత తేలిగ్గా దొరకదు. అలాంటప్పుడు మనసులోని మాటలు చెప్పుకోవడానికి చక్కటి వేదికలవుతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లు. రజనీకాంత్‌తో సినిమా చేయాలనుకుంటున్న డైరక్టర్లయినా, రాజమౌళికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్న హీరోలకైనా ఇవే బెస్ట్ స్టేజెస్ అవుతున్నాయి. రీసెంట్‌గా జపాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గెస్ట్ గా అటెండ్ అయ్యారు నాని. మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వాళ్లను వీళ్లు పొగుడుకోవడాలే ఉంటాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Nov 07, 2023 | 9:37 AM

ఎంత సెలబ్రిటీలైనా స్టార్ హీరోల దగ్గరకి వెళ్లడానికి యాక్సెస్ అంత తేలిగ్గా దొరకదు. అలాంటప్పుడు మనసులోని మాటలు చెప్పుకోవడానికి చక్కటి వేదికలవుతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లు. రజనీకాంత్‌తో సినిమా చేయాలనుకుంటున్న డైరక్టర్లయినా, రాజమౌళికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్న హీరోలకైనా ఇవే బెస్ట్ స్టేజెస్ అవుతున్నాయి.

రీసెంట్‌గా జపాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గెస్ట్ గా అటెండ్ అయ్యారు నాని. మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వాళ్లను వీళ్లు పొగుడుకోవడాలే ఉంటాయి. కానీ జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త డిఫరెంట్‌గా జరిగింది. కార్తి, నాని కలిసి చిట్‌చాట్‌లో కూర్చున్నారు. వారిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమన్నప్పుడు ఆడిటోరియం హోరెత్తింది.

సేమ్ అలాంటి వైబే క్రియేట్ అయింది జిగర్తండ డబుల్ ఎక్స్ ఈవెంట్‌లో. లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. జిగర్తండ ట్రైలర్ కేక పుట్టిస్తోందని, డైరక్టర్‌ని తెగ పొగిడేశారు వెంకీ.

జిగర్తండ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజ్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. కార్తిక్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తనకు బాగా సూటవుతుందని, తనకు కూడా స్క్రిప్ట్ చేయమని అడిగేశారు వెంకీ.

ఆల్రెడీ సైంధవ్ మూవీని శైలేష్‌తో చేస్తున్న వెంకీ, ఇప్పుడు కార్తిక్‌లాంటి మరో కుర్ర డైరక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హ్యాపీగా ఉన్నారు విక్టరీ ఫ్యాన్స్.





























