Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖ‌లో భారత్- ఆసీస్ T20 మ్యాచ్.. రేపట్నుంచి టికెట్ల అమ్మకాలు.. ధరలు ఇలా..

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్‌ సాగరతీరం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. మధురవాడలోని డాక్టర్‌ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఈ భారత్, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం 15, 16 తేదీల్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్.

Vizag: విశాఖ‌లో భారత్- ఆసీస్ T20 మ్యాచ్.. రేపట్నుంచి టికెట్ల అమ్మకాలు.. ధరలు ఇలా..
Ind Vs Aus T20 Series
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2023 | 1:40 PM

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్‌ సాగరతీరం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. మధురవాడలోని డాక్టర్‌ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఈ భారత్, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం 15, 16 తేదీల్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్. బుధవారం ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(insider.in) లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రకటించింది.

ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి మాట్లాడతూ.. ‘ నవంబర్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ వేదిక.. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్’ అని తెలిపారు. ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాల కోసం విశాఖలో పలు ప్రాంతాలను నిర్ణయించామన్నారు. పీఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం ‘బీ’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తామని గోపీనాథ్ రెడ్డి వివరించారు. రద్దీ నియంత్రణ కోసమే మూడు చోట్లా తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య టికెట్ల అమ్మకాలు జరుగుతాయన్నారు.

టికెట్ల ధరలు ఇలా.. రూ. 600, రూ. 1,500, రూ. 2000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6000 రేట్లతో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలు చేసినవారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో 22వ తేదీ వరకు, అదే విధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్‌లో ఉన్న కౌంటర్లలో 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చునని చెప్పారు అసోసియేషన్ అధికారులు.

లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్
లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్
భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..
అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..
మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..
మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..
EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్
EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్
జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI