Pneumonia: చైనాలో వేగంగా విస్తరిస్తున్న న్యుమోనియా.. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన

మరోవైపు పాఠశాల్లో, ఆసుపత్రుల్లో ఈ శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చైనా అధికారులు కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సంబంధించి చైనా విధించిన నిబంధనలను కొన్ని రోజుల క్రితమే సడలించింది. చైనాలో శీతాకాలం కూడా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఒక కొత్త వ్యాధి మళ్ళీ చైనా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా విస్తరిస్తోంది.

Pneumonia: చైనాలో వేగంగా విస్తరిస్తున్న న్యుమోనియా.. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన
China Virus Pneumonia
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2023 | 9:20 AM

చైనాలో వ్యాపిస్తోన్న నిమోనియాపై భారత్‌తో పాటు యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. చైనాలో ఇప్పటివరకు న్యుమోనియా కనీసం 77 వేల మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. లియోనింగ్ అనేది చైనా ఉత్తరాన ఉన్న ఒక ప్రావిన్స్ ప్రాంతం. ఇక్కడ నుంచే నిమోనియా వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ప్రజల మనస్సులలో భయం నెలకొంది. అంతేకాదు ఈ చైనీస్ న్యుమోనియా ప్రాణాంతకం కాదా అని ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ కరోనా వంటి భయంకరమైన రూపాన్ని తీసుకుంటుందనే భయాందోళనల మధ్య.. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు ఆందోళన చెందాల్సిన లక్షణాలు వెలుగులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం భరోసా ఇస్తుంది.

WHO గురువారం చైనా ప్రభుత్వం నుండి వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని కోరింది. ఈ సమాచారం ఆధారంగా ఈ వ్యాధి గురించి ఇప్పటివరకు అసాధారణ లక్షణాలు ఏమీ కనుగొనలేదని చెప్పారు. అనేకాదు  కొత్త వైరస్ కనుగొనలేదని WHO తెలిపింది.

ఆసుపత్రుల్లో పడకల కొరత!

మరోవైపు పాఠశాల్లో, ఆసుపత్రుల్లో ఈ శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చైనా అధికారులు కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సంబంధించి చైనా విధించిన నిబంధనలను కొన్ని రోజుల క్రితమే సడలించింది. చైనాలో శీతాకాలం కూడా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఒక కొత్త వ్యాధి మళ్ళీ చైనా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా విస్తరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు చైనాకు ఉత్తరాన ఉన్నాయి. ఇక్కడి ఆస్పత్రుల్లో పడకలు మరిన్ని పెంచాలని కోరుతున్నారు. బాధితులు పెరగడంతో ఆసుపత్రుల్లో పడకల కొరత ఉంది.

ఇవి కూడా చదవండి

సమాచారాన్ని దాచిపెట్టారనే ఆరోపణలు

కోవిడ్ సమయంలో చైనా సరైన సమాచారాన్ని ఇవ్వకుండా దాచినట్లు WHO, ప్రపంచ దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. చైనాలోని వుహాన్ నుండి కోవిడ్ ఎలా ఉద్భవించింది అనే దానిపై నిపుణులు నిరంతరం డిమాండ్ చేస్తున్న పరిశోధన పారదర్శకంగా జరగలేదు. ఈసారి కూడా చైనా కొత్త వ్యాధి గురించి ఏదైనా దాస్తోందా అనే సందేహం ప్రపంచానికి ఉంది. WHO కి చైనా ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పూర్తిగా సరైనదేనా? అయితే  ప్రస్తుతం పరిస్థితి భయాందోళనకు గురిచేసే పరిస్థితి లేదు. రాయిటర్స్ నివేదిక ప్రకారం చైనాలోని షాంఘైలో కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం దీని వేవ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి త్వరలో ముగుస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఈ వ్యాధి  లక్షణాలు

1. పిల్లల ఊపిరితిత్తులలో వాపు

2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

3. నిరంతర దగ్గు

4. అధిక జ్వరం

మరిన్ని  అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!