India – EU: భారత్ – యూరప్ యూనియన్ మధ్య కీలక పరిణామం.. సెమీకండక్టర్ల స్వేచ్ఛా వాణిజ్యంపై కీలక ఒప్పందం
భారతదేశం-యూరప్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా మరో ముందడుగు పడింది. సెమీకండక్టర్లపై అవగాహన ఒప్పందంపై భారత్ - EU మధ్య కీలక ఎంవోయు కుదిరింది. దీనిపై యూరఫ్ అంతర్గత మార్కెట్ కమిషనర్ థియరీ బ్రెటన్, భారత ప్రభుత్వ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతకం చేశారు.
భారతదేశం-యూరప్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా మరో ముందడుగు పడింది. సెమీకండక్టర్లపై అవగాహన ఒప్పందంపై భారత్ – EU మధ్య కీలక ఎంవోయు కుదిరింది. దీనిపై యూరఫ్ అంతర్గత మార్కెట్ కమిషనర్ థియరీ బ్రెటన్, భారత ప్రభుత్వ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతకం చేశారు. ఈ ఒప్పందం EU – భారతదేశం బలమైన సెమీకండక్టర్ సరఫరాకు, ఆవిష్కరణపై కలిసి పని చేయాలని నిర్ణయించాయి.
సంబంధిత సెమీకండక్టర్ల పర్యావరణ వ్యవస్థలపై అనుభవాలు, ఉత్తమ పద్ధతులు, ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, వ్యాపారాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలలో సహకారం కోసం రెండు దేశాలు కలిసి పని చేయనున్నాయి. సెమీకండక్టర్స్ పరిశ్రమ కోసం నైపుణ్యాలు, ప్రతిభ, శ్రామికశక్తి అభివృద్ధిని ప్రోత్సహించడం, వర్క్‌షాప్‌ల ఏర్పాటు, భాగస్వామ్యాలు, ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా సహకారాన్ని సులభతరం చేయాలని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పబ్లిక్ రాయితీలపై సమాచారాన్ని పంచుకోవడంతో సహా, సెక్టార్‌లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని నిర్ధారించుకోవాలని నిర్ణయించాయి.
సెప్టెంబరు నెలలో న్యూఢిల్లీలో జరిగిన జి20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రకటించారు. IMEC అనేది భారతదేశం నుండి యూరప్‌కు ప్రణాళికాబద్ధమైన కొత్త వాణిజ్య మార్గం. భారతదేశంతో పాటు, ఈ బహుళజాతి కారిడార్‌లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్, అమెరికా ఉన్నాయి. IMEC వాణిజ్యం, మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లను నిర్మించాలని ఢిల్లీ వేదికగా నిర్ణయించారు. అయా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, కనెక్టివిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు కేంద్ర మంత్రి.
MoU signed between India and EU to deepen cooperation on semiconductor ecosystem and enhance resilience in semiconductor supply chain. pic.twitter.com/9w8hq6s2Q5
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 24, 2023
ఎకనామిక్ కారిడార్ అనేది రోడ్లు, ఓడరేవులు, రైల్వేల సమగ్ర నెట్‌వర్క్, వస్తువుల సరఫరా, ప్రజల రాకపోకలను సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో సులభతరం చేయడానికి ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాలను కలుపుతుంది. ఇవి సాధారణంగా దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకుంటూ.. పెద్దన్నగా మారేందుకు ప్రత్నిస్తోంది భారత్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…