AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ఐసీయూలో, తండ్రి జైల్లో.. ఆకలితో ఏడుస్తున్న 4నెలల చిన్నారి పట్ల మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం

తల్లి అస్వస్థతకు గురికావడంతో పసికందు ఆకలితో ఎడతెగకుండా ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన అధికారి ఆర్య ముందుకొచ్చి ఏడుస్తున్న పాపకు పాలిచ్చి, ఆ చిన్నారిని శాంతింపజేసి చివరికి నిద్రపోయేలా చేసింది. ఓ కేసులో నిందితురాలైన పసిపాప తల్లి జైలులో ఉంటోంది. జైలులో ఉన్న మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఎర్నాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తీసుకువచ్చారు.

తల్లి ఐసీయూలో, తండ్రి జైల్లో.. ఆకలితో ఏడుస్తున్న 4నెలల చిన్నారి పట్ల మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం
Woman Cop Breastfeeding
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2023 | 8:28 PM

Share

ఒక మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం చూపించింది. ఓ నిందితురాలి నాలుగు నెలల పసిబిడ్డను అక్కున చేర్చుకుని తల్లిలా పాలిచ్చి కడుపునింపింది. ఆకలితో ఉన్న బిడ్డను చూసి చలించిపోయిన ఆ లేడీ పోలీస్‌ ఖాకీ డ్రెస్‌ వెనుక ఉన్న తల్లి మనసు కరిగిపోయింది. వెంటనే పసిబిడ్డను దగ్గరకు తీసుకుని పాలుపట్టిచింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కాగా, మహిళ అధికారిణి చేసిన పని అందరి హృదయాలను కదిలించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పోలీసు సిబ్బంది ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో విషయం నెట్టింట సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలిసిన సమాచారం మేరకు…పాప తల్లి – బీహార్‌లోని పాట్నా నివాసి – కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పాట్నా వాసి నలుగురు పిల్లలను చూసుకునే వారు లేకపోవటంతో వారిని సహాయం కోసం గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లి అస్వస్థతకు గురికావడంతో పసికందు ఆకలితో ఎడతెగకుండా ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన అధికారి ఆర్య ముందుకొచ్చి ఏడుస్తున్న పాపకు పాలిచ్చి, ఆ చిన్నారిని శాంతింపజేసి చివరికి నిద్రపోయేలా చేసింది. ఓ కేసులో నిందితురాలైన పసిపాప తల్లి జైలులో ఉంటోంది. జైలులో ఉన్న మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఎర్నాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో మోహరించిన పోలీసు సిబ్బంది మిగిలిన పిల్లలకు కూడా ఆహారం తినిపించారు. ప్రస్తుతం నలుగురు పిల్లల పరిస్థితి బాగానే ఉంది. పేదరికం కారణంగా స్త్రీ వారిని సరిగ్గా పోషించలేకపోయింది. ఆమె తనను తాను చూసుకోలేక అస్వస్థతకు గురైంది. ఇక ఇప్పుడు ఆమె చికిత్స ఖర్చులను మహిళా పోలీసు సిబ్బంది భరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. పోలీసుల ఔదర్యాన్ని చూసి ప్రజలు ఆమెను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం క్లిక్ చేయండి..