పెళ్లికొడుకు మెడలో కరెన్సీ నోట్ల దండ.. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న కాస్ట్లీ వరుడు..!

ఓ యువకుడు రూ.20 లక్షల నోట్ల దండను ధరించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారగా, ఇప్పటివరకు ఆ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. వీడియోలో కనిపించే యువకుడు బాగా ధనవంతుడు అనుకుంటా అని ఒకరు కామెంట్ చేయగా, అత్తగారింటి కట్నం అనుకుంటా అంటూ మరొకరు కామెంట్‌లో రాశారు. ఇంకా మరికొందరు భద్రం గురూ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.

పెళ్లికొడుకు మెడలో కరెన్సీ నోట్ల దండ.. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న కాస్ట్లీ వరుడు..!
Currency Note Garland
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 24, 2023 | 6:14 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతినిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వ్యూస్‌, లైకుల కోసం నేటి తరం యువకులు చేసే అడ్డగోలు ప్రయోగాలు నెటిజన్లను కట్టిపడవేస్తున్నాయి. వేదికతో సబంధం లేకుండా వార్తల్లో నిలిచేందుకు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించాలనే కోరికతో.. డిఫరెంట్ స్టైల్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో వింత వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి. ఇలాంటిదే ఓ వరుడు చేసిన ఫన్నీ ఇన్సిండెంట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెళ్లి కొడుకు మెడలో పూల దండలకు బదులు కరెన్సీ నోట్లతో తయారు చేసిన మాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సరికొత్త ట్రెండ్ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి సందర్బంగా వరుడికి కరెన్సీ నోట్ల దండను వేయడం మీరు చూసే ఉంటారు. అయితే కొంతమంది నిజమైన నోట్ల దండను ధరిస్తే..మరికొందరు నకిలీ నోట్లతో తయారు చేసిన నోట్ల దండలు వేసుకుని కనిపిస్తారు. కానీ, ఒక వరుడు రూ. 20 లక్షల విలువైన కరెన్సీ నోట్ల దండను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారీ పొడవైన కరెన్సీ దండతో ఇంటి టెర్రస్‌పై నిలబడి అతడు ఫోటోలు, వీడియోలకు ఫోజులిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వింత వింత రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Instagram వినియోగదారు @dilshadkhan_kureshipur ఇటీవల Instagramలో ఒక వరుడి తయారీకి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సాధారణంగా పెళ్లికొడుకు మెడలో వేసే నోట్ల దండల పొడవు రెండున్నర నుండి మూడు అడుగుల మధ్య ఉంటుంది. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం ఆశ్చర్యపరిచే విధంగా నోట్ల దండ భారీ పొడవుతో తయారు చేశారు. దాదాపు 17-20 ఏళ్ల యువకుడి మెడలో 15-20 అడుగుల పొడవైన నోట్ల దండను వేశారు. ఆ నోట్ల దండలో అన్నీ 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. ఈ దండ నిజమో, నకిలీదో చెప్పడం కష్టం. కానీ, పక్కనే నిలబడి ఉన్న మహిళలు మాత్రం యువకుడి వైపే చూస్తున్నారు.

ఓ యువకుడు రూ.20 లక్షల నోట్ల దండను ధరించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారగా, ఇప్పటివరకు ఆ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. వీడియోలో కనిపించే యువకుడు బాగా ధనవంతుడు అనుకుంటా అని ఒకరు కామెంట్ చేయగా, అత్తగారింటి కట్నం అనుకుంటా అంటూ మరొకరు కామెంట్‌లో రాశాలు. ఇంకా మరికొందరు భద్రం గురూ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?