రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. ఏ వయసులో ఎంత నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే..
ప్రతి రోజూ వాకింగ్‌తో మెదడు , నాడీ వ్యవస్థలో ఉన్న హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది , మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవాళ్లు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అటువంటి వ్యక్తులలో సంతోషకరమైన హార్మోన్లు ఎక్కువగా తయారవుతాయి. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.
రోజూ వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. వాకింగ్‌తో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీ రక్తంలో చక్కెర కూడా నియంత్రణలో ఉంటుంది. మీ జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నడక అనేది ప్రజలకు చాలా మంచి వ్యాయామంగా నిపుణులు పదే పదే చెబుతుంటారు. అందుకే చాలా మంది అన్ని వ్యాయామాల్లో కెల్లా వాకింగ్‌కే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. వాకింగ్‌తో బరువును తగ్గించడమే కాకుండా మీ మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. నడక మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచుతుంది. రక్త ప్రసరణను కూడా నిర్వహిస్తుంది. కాబట్టి, వారి వారి వయస్సును బట్టి రోజుకు ఎంతసమయం వాకింగ్ చేయాలి ..? ఏ సమయంలో చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..దీంతో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
6 నుండి 17 సంవత్సరాల మధ్య..
ప్రతి ఒక్కరూ వయస్సును బట్టి వారి వారి దశలపై శ్రద్ధ వహించాలి. నడక మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచుతుంది. మీ రక్త ప్రసరణను కూడా నిర్వహిస్తుంది. కాబట్టి 6 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 13 నుండి 15 వేల అడుగులు నడవాలి.
18 నుంచి 40 సంవత్సరాల మధ్య గలవారు..
18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు 12 వేల అడుగులు నడవాలి. దీని వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడకుండా ఉంటారు. నేటి జీవనశైలి కారణంగా ప్రజలు ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే 40 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా వాకింగ్ చేయాలి.
40 సంవత్సరాల తర్వాత..
40 ఏళ్ల తర్వాత రోజూ ప్రతి ఒక్కరూ 11 వేల అడుగులు నడవాలి. మనుషులు కష్టపడి పనిచేయాల్సిన వయసు ఇది. అలాగే, పెరుగుతున్న శరీర బరువును వాకింగ్ ద్వారానే కంట్రోల్ ఉంచుకోగలుగుతారు. అలాగే వ్యాధులకు కూడా దూరంగా ఉండటానికి వాకింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది.
నడక మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. ప్రతి రోజూ వాకింగ్‌తో మెదడు , నాడీ వ్యవస్థలో ఉన్న హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది , మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవాళ్లు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అటువంటి వ్యక్తులలో సంతోషకరమైన హార్మోన్లు ఎక్కువగా తయారవుతాయి. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..