Destination Wedding Tips: ఈ 5 హోటల్‌లు ఒకప్పుడు ప్యాలెస్‌లు, నేడు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి
ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి చాలా క్రేజ్ ఉంది. చాలా మంది జంటలు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. నూతన వధూవరులు.. సిమ్లా, గోవా లేదా ఇతర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను తమ డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్‌గా మార్చుకుంటున్నారు. అయితే, మన దేశంలో చాలా పెద్ద హోటళ్ళు ఉన్నాయి. అవి వివాహాలకు కూడా ప్రాధాన్యతనిస్తాయి. ఇక్కడ పెళ్లి చేసుకోవడం అందరి కలగా భావిస్తారు. అలాంటి హోటళ్లకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 22, 2023 | 9:27 PM

Umaidbhawan Palace: ఉమైద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. ఇది చాలా అద్భుతమైన మరియు అందమైన ప్యాలెస్. ఈ ప్యాలెస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. (ఫోటో: Inst/@umaidbhawanpalace)

Rambagh Palace: ఈ హోటల్ ఒకప్పుడు జైపూర్ మహారాజు నివాసం. ఈ రాజభవనం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్యాలెస్‌ను జైపూర్ ఆభరణంగా కూడా పిలుస్తారు. రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ 1 ప్యాలెస్‌గా మారింది. (ఫోటో: Inst/@rambaghpalace)

Tajfalaknuma: అందం, వైభవానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫలక్‌నుమా ప్యాలెస్ హైదరాబాద్‌లో ఉంది. ఇది చార్మినార్ నుండి 5 కి.మీ దూరంలో నిర్మించబడింది. ఫలక్‌నుమా అంటే స్వర్గంలోని ఆకాశం, నక్షత్రం లాంటిది. మీరు మీ కుటుంబంతో గడపడానికి సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఇక్కడకు రావచ్చు. అలాగే, వైభవానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్యాలెస్ రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మంచి ఎంపిక. (ఫోటో: Inst/@tajfalaknuma)

Neemrana Rajasthan: ఢిల్లీకి కేవలం 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని నీమ్రానా కోట కూడా ఒకప్పుడు ప్యాలెస్. కానీ ఇప్పుడు దాన్ని హోటల్‌గా ఉపయోగిస్తున్నారు. మీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, అనేక ఇతర రకాల పార్టీల కోసం దీన్ని ఎంచుకోవచ్చు. (ఫోటో: Inst/@wahhrajasthan)

Tajlake Palace Udaipur: ఉదయపూర్‌లోని పిచోలా సరస్సుపై ఉన్న తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. చెరువు మధ్యలో ఉన్న ఈ హోటల్ అందాలు చూస్తే మతి పోతుంది. ఇంతకుముందు ఇది చాలా అందమైన ప్యాలెస్‌గా ఉండేది. దానిని హోటల్‌గా మార్చారు. నేడు పర్యాటకులు సెలవులు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం ఇక్కడికి రావడానికి క్యూ కడుతున్నారు. (ఫోటో: Inst/@tajlakepalace)