ఒకే కాన్పులో పుట్టిన నలుగురు మగపిల్లలు.. సేఫ్‌గా తల్లి, బిడ్డలు…ఊరు ఊరంతా పండగ..
ఈ సారి ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలతో భరత్ యాదవ్ కుటుంబంలో ఐదుగురు కుమారులు ఉన్నారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని భరత్ యాదవ్ తెలిపారు. ఒకే సమయంలో నలుగురు పిల్లలను చూసుకోవడం చాలా కష్టమన్నారు. నలుగురు పిల్లలు ఒకేసారి ఏడిస్తే..వారికి తల్లిపాలు పట్టించటం చాలా కష్టంగా ఉందన్నారు. కానీ, క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఎంత కష్టమైన సరే.. తాను, తన భార్య సంతోషంగా తమ పిల్లలను పెంచుకుంటామని చెప్పారు.
ఒకే కాన్పులో కవలలు పుట్టడం అనేది చాలా సందర్భాల్లో చూస్తుంటాం.. ఇది సాధారణం విషయంగానే చెప్పుకోవాలి.. కానీ ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం చాలా అరుదు.. అసాధారణం కూడా. కానీ, ఇక్కడో గర్భిణీ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలోలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నైనిజోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట్కీ నైనిజోర్ గ్రామానికి చెందిన భరత్ యాదవ్ భార్య జ్ఞానతి దేవి (32) ఏకకాలంలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండడంతో జ్ఞానతి దేవికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు భర్త, ఇక్కడ సభ్యులు. అక్కడే ఆమె నలుగురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియటంతో భరత్ యాదవ్ కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులు సైతం ఆనందంలో మునిగిపోయారు.
ఒక్కసారిగా జ్ఞానతీ దేవి దంపతుల ఫ్యామిలీ పెరిగిపోయింది. ఈ నలుగురు పిల్లలు పుట్టకముందే, వారికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ సారి ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలతో భరత్ యాదవ్ కుటుంబంలో ఐదుగురు కుమారులు ఉన్నారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని భరత్ యాదవ్ తెలిపారు. ఒకే సమయంలో నలుగురు పిల్లలను చూసుకోవడం చాలా కష్టమన్నారు. నలుగురు పిల్లలు ఒకేసారి ఏడిస్తే..వారికి తల్లిపాలు పట్టించటం చాలా కష్టంగా ఉందన్నారు. కానీ, క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఎంత కష్టమైన సరే.. తాను, తన భార్య సంతోషంగా తమ పిల్లలను పెంచుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే, జ్ఞానతీ దేవికి సర్జరీ చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ గుంజన్ సింగ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొదట జ్ఞానతి దేవి కడుపులో నలుగురు పిల్లలు ఉన్నట్టుగా తెలియలేదని చెప్పారు. ఆపరేషన్ సమయంలోనే ఆ మహిళ కడుపులో ఒకరు కాదు నలుగురు పిల్లలను మోసినట్టుగా తెలిసిందన్నారు. అంతేకాదు.. నలుగురు మగపిల్లలేనని తెలిసిందన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయి నలుగురు శిశువులు, తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉండటం పట్ల డాక్టర్ గుంజన్ సింగ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిలో ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఒకేకాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం పట్ల ఆస్పత్రి వర్గాలు సైతం సంతోషం వ్యక్తం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..