Rubber Tyres train viral video: రబ్బరు టైర్లతో రైలు.. రోడ్డుపై నడుస్తుందా..? వైరల్ వీడియోపై నెటిజన్ల రియాక్షన్ చూడాల్సిందే..!
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో ఇప్పటికే ఆరు లక్షలకు పైగా నెటిజన్లు వీడియోని వీక్షించారు. దీనితో పాటు, సుమారు పది వేల మంది ఈ రైలును లైక్ చేసారు. ఈ వీడియోను లైక్ చేసిన నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేసారు. అలాగే చాలా మంది కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఈ రైలులో కూర్చున్నాక సౌండ్ రాదని, కారులో కూర్చున్న ఫీల్ ఉంటుందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారు ఈ రైలును లోకో పైలట్ రోడ్డుపై నడపగలడా..? అంటూ
నేటి ఆధునిక యుగంలో మనిషి అనేక కొత్త ఆవిష్కరణలను సృష్టించాడు. టెక్నాలజీ సాయంతో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వందల సంవత్సరాల క్రితం మనుషులు చెక్క చక్రాలతో తయారు చేసిన వాహనాలను ఉపయోగించి ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించేవారు. కానీ క్రమంగా ప్రజలు ఇనుము, రబ్బరుతో చేసిన చక్రాలను కనుగొన్నారు. ఉపయోగించడం ప్రారంభించారు. అదేవిధంగా, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా రైలును సవరించారు. మొదట్లో రైలు ఆవిరి ఇంజిన్‌తో నడిచేది. కానీ, ఇప్పుడు అది విద్యుత్తుతో నడుస్తుంది. కానీ మనిషి ఇప్పుడు దీనికంటే మరో అడుగు ముందుకేసాడు. రైళ్లలో ఇనుప చక్రాలకు బదులు రబ్బరు టైర్లను ఉపయోగించడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఈ రైలు వీడియో హల్‌చల్ చేసింది. ఇందులో రైలుకు రబ్బరు టైర్లు ఉన్నాయి. ఈ రకమైన రైలును చూసిన వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఈ రకమైన రైలును మొదటిసారి చూశామంటూ తమదైన స్టైల్లో స్పందించారు.
రైలు కోసం ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు..
సమాచారం ప్రకారం, ఈ రబ్బరు టైర్లు ఉన్న రైలు ఎక్కడ నుండి వచ్చింది? అనేది మాత్రం తెలియరాలేదు. కానీ, అది ఏదో ఒక దేశం నుంచి వచ్చిన రైలు అని వీడియోలో చెబుతున్నారు. రబ్బరు టైర్లతో రైళ్లు ఎక్కడ నడుస్తాయి. ఈ వీడియో ఇండియా ట్రావెల్స్ పేరుతో ఉన్న Facebook పేజీ ద్వారా షేర్ చేయబడింది. ఇందులో ఒక వ్యక్తి రబ్బరు టైర్లతో కూడిన రైలు గురించి చెప్పాడు. ఈ రైలు ప్రత్యేక రకం మెటల్ ట్రాక్‌పై నడుస్తుందని ఆయన వివరించారు. సాధారణంగా మనం మామూలు రైలులో చూడని ట్రక్కు లాంటి టైర్లను ఈ రైలులో అమర్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో ఇప్పటికే ఆరు లక్షలకు పైగా నెటిజన్లు వీడియోని వీక్షించారు. దీనితో పాటు, సుమారు పది వేల మంది ఈ రైలును లైక్ చేసారు. ఈ వీడియోను లైక్ చేసిన నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేసారు. అలాగే చాలా మంది కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఈ రైలులో కూర్చున్నాక సౌండ్ రాదని, కారులో కూర్చున్న ఫీల్ ఉంటుందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారు ఈ రైలును లోకో పైలట్ రోడ్డుపై నడపగలడా..? అంటూ ఫన్నీ ఎమోజీతో రాశారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు ఈ రైలును అద్భుతంగా ఉందంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..