చలికాలంలో బాదంపప్పు కంటే వేయించిన వేరుశెనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

వేరుశెనగలో నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అల్జీమర్స్, వయస్సు-సంబంధిత అభిజ్ఞా సమస్యల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే, వేరుశెనగలో మాంగనీస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. మీ ఆహారంలో వేరుశనగలను తరచూగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే..

చలికాలంలో బాదంపప్పు కంటే వేయించిన వేరుశెనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Peanuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 24, 2023 | 2:48 PM

శీతాకాలంలో చలి గాలుల కారణంగా మన చర్మం నుండి తేమ కోల్పోతుంది. అందుకే చలికాలంలో మన శరీరాన్ని తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవటం ముఖ్యం. అలాంటి వాటిలో వేరుశెనగలు అద్భుత ప్రయోజనాలను కలిగిస్తాయి. చలికాలంలో బాదంపప్పు కంటే వేయించిన వేరుశెనగలు ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. మీకు ఆకలిని కలిగించదు.

వేరుశెనగలో అధిక నాణ్యత గల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, శారీరక శ్రమ తర్వాత కండరాలు కోలుకోవడానికి, మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. వేరుశెనగలో ఉండే పోషకాలు క్యాన్సర్ నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్ ప్రొస్టేట్ ట్యూమర్ ప్రమాదాన్ని 40శాతం తగ్గిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని 50శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే, ఎక్కువ ఒత్తిడిగా ఉన్న స‌మ‌యంలో ఒక్క క‌ప్పు ఉడికించిన వేరు శ‌న‌గ‌ల‌ను తీసుకోవటం మంచింది. దీంతో ఒత్తిడి తగ్గిపోవటంతో పాటు త‌ల‌నొప్పి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్యలు సైతం త‌గ్గుతాయి.

ఫోలేట్ అనేది గర్భధారణ సమయంలో చాలా ముఖ్యమైన పోషకం. ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫోలేట్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు..అల్జీమర్స్‌ బాధితులకు సైతం వేరుశనగ ప్రభావవంతమైన ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఉడికించిన వేరు శ‌న‌గ‌ల‌ను తిన‌డం వల్ల అతిగా జుట్టు రాలిపోయే స‌మ‌స్యకు అడ్డు క‌ట్ట వేయ‌వ‌చ్చు. ఎక్కువ సమయం పాటు కడుపునిండిన అనుభూతి కారణంగా శ‌రీర బ‌రువు అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వేరుశెనగలో నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అల్జీమర్స్, వయస్సు-సంబంధిత అభిజ్ఞా సమస్యల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే, వేరుశెనగలో మాంగనీస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. మీ ఆహారంలో వేరుశనగలను తరచూగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే వేరుశెనగలను తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)