Adaa: ప్రపంచ రెస్టారెంట్‌లో ఫలక్ నుమాలోని అదా రెస్టారెంట్‌కు మూడవ స్థానం.. గర్వం అంటున్న హైదరాబాదీ వాసులు

ఫలక్నామాలోని ఇంజిన్ బౌలీలో ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాదీ వంటకాల్లో ప్రత్యేకత కలిగి ఉంది.  భారతదేశంలోని ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో ఢిల్లీ కి చెందిన ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ ముందు ఉండగా బెంగళూరులోని కరవల్లి తర్వాత స్థానంలో ఉంది. ఈ విధంగా భారత దేశంలో మొత్తం టాప్ 10 రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఫలక్నామాలోని అదా రెస్టారెంట్ చోటు తగ్గించుకోవడంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ వాసులు.

Adaa: ప్రపంచ రెస్టారెంట్‌లో ఫలక్ నుమాలోని అదా రెస్టారెంట్‌కు మూడవ స్థానం.. గర్వం అంటున్న హైదరాబాదీ వాసులు
Adaa Restarent
Follow us
TV9 Telugu

| Edited By: Surya Kala

Updated on: Nov 24, 2023 | 12:38 PM

ప్రపంచంలో అద్భుత రెస్టారెంట్ల లిస్ట్ ను విడుదల చేసింది ఫ్రాన్స్ కు చెందిన గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ. ప్రపంచంలోనే టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్ స్థానాన్ని దక్కించుకుంది.. ఫ్రాన్స్ కు చెందిన గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ కేటాయించిన స్కోర్ ల ద్వారా నిర్ణయించబడిన ఈ జాబితాలో అనేక భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్క భారతదేశం నుంచి మాత్రమే కాదు ఆయా ఆయా దేశాల నుండి అనేక రెస్టారెంట్లు పోటీపడ్డాయి. టాప్ వెయ్యి రెస్టారెంట్ల జాబితాలో మన హైదరాబాద్ లోని రెస్టారెంట్ కూడా స్థానం దక్కింది. ఆ రెస్టారెంట్ ఏది అన్న విషయాన్నికి వస్తే ఫలక్నామా ప్యాలెస్ మూడో స్థానంలో నిలిచింది. ఒక్క భారతదేశం నుంచి వేల రెస్టారెంట్లు పోటీ పడగా ప్రపంచంలో అనేక రెస్టారెంట్లు పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ప్రపంచంలోని టాప్ 1000 రెస్టారెంట్లో మన హైదరాబాదీ లోని అదా రెస్టారెంట్ కు మూడవ స్థానం దక్కడం గర్వంగా ఉంది అంటున్నారు హైదరాబాద్ వాసులు.

ఫలక్నామాలోని ఇంజిన్ బౌలీలో ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాదీ వంటకాల్లో ప్రత్యేకత కలిగి ఉంది.  భారతదేశంలోని ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో ఢిల్లీ కి చెందిన ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ ముందు ఉండగా బెంగళూరులోని కరవల్లి తర్వాత స్థానంలో ఉంది. ఈ విధంగా భారత దేశంలో మొత్తం టాప్ 10 రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఫలక్నామాలోని అదా రెస్టారెంట్ చోటు తగ్గించుకోవడంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ వాసులు.

ఈ రెస్టారెంట్ కు మూడో స్థానం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే.. నిజాం ప్రభువుల కాలం నాటి ఇంటీరియర్ వర్క్ అంతే కాకుండా ఒక్కసారి ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆనాటి కాలంలోకి తీసుకు వెళ్లేటటువంటి ఆనవాళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన కళ నైపుణ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం అలాంటి వాతావరణంలో నోరూరించే వంటకాలతో కనువిందు చేస్తుంది ఈ ఆదా రెస్టారెంట్. ఒక్క సారి రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే కళ్ళు చెదిరే డెకరేషన్స్, రాజుల నాటి డైనింగ్ టేబుల్స్ కుర్చీలు.. ఎక్కడ చూసినా రాజ్యసం ఉట్టిపడేలా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వివిధ రకాల వంటకాల శుభ్రత ,నాణ్యత అన్ని పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే టాప్ త్రీ రెస్టారెంట్ గా చోటు దక్కించుకుంది. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు భోజనం చేయాలి అంటే 13 వేల రూపాయలు కాస్ట్ ఉంటుంది. డబ్బుకు తగ్గట్టుగానే రుచి కూడా ఉంటుంది. అప్పటి నిజాం కాలం నాటి రాజుల రాజు భోగాలను అనుభవించుకుంటూ ఏ విధంగా అయితే జీవించారో ఒక్కసారిగా ఆ ప్రపంచంలోకి వెళ్ళే విధంగా ఆ రుచులు ఉంటాయి. ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిన ఫలక్నామా ప్యాలెస్ లోని అదా రెస్టారెంట్ కి ప్రపంచంలోనే మూడవ స్థానంలో చోటు దక్కించుకోవడంలో సందేహం లేదు. దీంతో కొంత కష్టమైనా సరే ఆ రుచిని టేస్ట్ చేసేందుకు ఆ రెస్టారెంట్ ని చూసేందుకు ఒక్కసారైనా వెళ్లాలి అని అనుకుంటున్నారు భోజన ప్రియులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!