AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Odisha border: ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకీ లభ్యం.. ఎవరివో తెలుసా..?

Andhra Pradesh: ఒక్క క్షణం ఆగి పరిశీలించిన భద్రతా సిబ్బంది అక్కడ ఏదో ఉన్నట్టు గుర్తించారు. వారికి అక్కడ అనుమానాస్పద వస్తువులు, పరికరాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అక్కడ సెర్చ్‌ చేసిన సిబ్బందికి మెటల్ డిటెక్టర్లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ నుంచి ఇండికేషన్స్ వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి భద్రత బలగాలు. మరింత లోతుగా పరిశీలించగా ప్రమాదకర డంప్ లభించింది.

Andhra Odisha border: ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకీ లభ్యం.. ఎవరివో తెలుసా..?
Explosives, Rifles Found
Maqdood Husain Khaja
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 22, 2023 | 8:20 PM

Share

విశాఖపట్నం, నవంబర్22; ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న సమయంలో.. ఆ సమాచారం భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న బలగాలకు.. అనుమానం వచ్చింది. ఒక్క క్షణం ఆగి పరిశీలించిన భద్రతా సిబ్బంది అక్కడ ఏదో ఉన్నట్టు గుర్తించారు. వారికి అక్కడ అనుమానాస్పద వస్తువులు, పరికరాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అక్కడ సెర్చ్‌ చేసిన సిబ్బందికి మెటల్ డిటెక్టర్లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ నుంచి ఇండికేషన్స్ వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి భద్రత బలగాలు. మరింత లోతుగా పరిశీలించగా ప్రమాదకర డంప్ లభించింది.

– ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నారు భద్రత బలగాలు. ఒడిశా మత్తిలి పీఎస్ కిరిమితి – తులసి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లాయి. ఒడిస్సా డిస్టిక్ వాలంటరీ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న బలగాలకు డంప్‌ కనిపించింది. ఆ డంపులో భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలు బయటపడ్డాయి.

–  ఓ దేశవాళి తుపాకీ, 150 జిలెటిన్ స్టిక్స్, 13 స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, ఫ్యుజ్ వైరు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టు ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంపుగా అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడేందుకు మావోయిస్తులు పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకున్నట్టు బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కూంబింగ్ ను మరింత విస్తృతం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..