Viral News: వామ్మో.. ఆమె నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయ్.. అందరి చూపూ ఆమెపైనే.. గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేసింది..
దీని వల్ల ఆమెకు ఎలాంటి నొప్పి కలగకపోయినప్పటికీ, అదనపు దంతాల మధ్య ఆహారం తరచుగా ఇరుక్కుపోవడంతో తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. తమ కుమార్తెకు 6 అదనపు దంతాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు, వారు షాక్‌కు గురయ్యారు. వాటిని తొలగించమని కోరారు. అయితే దంతాలు అంత తేలికగా తీయలేనందున వాటిని అలాగే వదిలేయమని కల్పన డెంటిస్ట్ సూచించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు కావడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేసింది. దానిని తన జీవిత సాఫల్యంగా పేర్కొన్నారు.
Guinness Book of World Records: ప్రపంచంలో ప్రత్యేకమైన, వింత విషయాలకు కొరత లేదు. నమ్మశక్యం కాని అనేక విషయాలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి.. కొందరు భిన్నమైన విషయాల్లో రికార్డులు సృష్టిస్తారు. మరికొందరు రికార్డులు బద్దలు కొడతారు, అయితే కొన్ని రికార్డులు వారే సృష్టించారు. వారే బ్రేక్ చేస్తారు. అలాంటిదే ఇక్కడ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన నోటిలో ఉండే పళ్లతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. ఆ మహిళకు నాలుగు అదనపు దిగువ దవడ పళ్ళు, రెండు అదనపు పై దవడ పళ్ళు ఉన్నాయి. దీంతో కల్పనా బాలన్ అనే ఇండియాకు చెందిన 26 ఏళ్ల మహిళ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. దీనిని అరుదైన కేసు అంటున్నారు వైద్యులు.
సాధారణంగా మానవులలో 32 దంతాలు కనిపిస్తాయి. కానీ కల్పనా బాలన్‌కు 38 దంతాలు ఉన్నాయి.. సాధారణ స్త్రీల కంటే ఆమెకు 6 ఎక్కువ దంతాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆ ఫోటోను షేర్ చేసారు. మొత్తం 38 దంతాలతో భారతదేశానికి చెందిన కల్పనా బాలన్ తన నోటిలో అత్యధిక దంతాలు కలిగి ఉండి ప్రపంచ రికార్డును సృష్టించినట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఆమెకు సగటు యుక్త మహిళ కంటే ఆరు ఎక్కువ దంతాలు ఉన్నాయి. 26 ఏళ్ల కల్పనకు నాలుగు దిగువ దవడ పళ్ళు, రెండు అదనపు పై దవడ పళ్ళు ఉన్నాయి. కెనడాకు చెందిన ఇవాన్‌హో మలోన్‌కు 41 దంతాలు ఉన్నాయి. ఇది మగవారిలో అత్యధికం.
Kalpana Balan from India has six more teeth than the average human.
Read more by clicking the picture 👇
— Guinness World Records (@GWR) November 20, 2023
కల్పన తన యుక్తవయస్సులో క్రమంగా తనకు అదనపు దంతాలు రావటం గమనించింది. ఈ దంతాలు ఒక్కొక్కటిగా పెరిగాయని చెప్పారు. దీని వల్ల ఆమెకు ఎలాంటి నొప్పి కలగకపోయినప్పటికీ, అదనపు దంతాల మధ్య ఆహారం తరచుగా ఇరుక్కుపోవడంతో తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. తమ కుమార్తెకు 6 అదనపు దంతాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు, వారు షాక్‌కు గురయ్యారు. వాటిని తొలగించమని కోరారు. అయితే దంతాలు అంత తేలికగా తీయలేనందున వాటిని అలాగే వదిలేయమని కల్పన డెంటిస్ట్ సూచించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు కావడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేసింది. దానిని తన జీవిత సాఫల్యంగా పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..