Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది.

Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..
Anand Mahindra
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 22, 2023 | 7:01 PM

యావత్ ప్రపంచం ప్రస్తుతం పలు రకాల కాలుష్యంతో పోరాడుతోంది. పరిశ్రమల వ్యర్థాలు, ప్రజల అజాగ్రత్త, ఉద్దేశపూర్వకంగా పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యల వల్ల పర్యావరణంతో చెలగాటమాడుతున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా కాలుష్య సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని చాలా మంది ప్రజలు మానుకోవడం లేదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సముద్రపు నీటిని వారు కలుషితం చేస్తున్న తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ ఉజ్జల్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తనను చాలా బాధపెడుతోందని వ్యాఖ్యానించారు. పౌరులు తమ వైఖరిని మార్చుకోకపోతే, భౌతిక మౌలిక సదుపాయాలను ఎంత మెరుగుపరిచినా నగర జీవితాన్ని మెరుగుపరచలేమని పేర్కొన్నారు. ముంబై పోలీసులతో పాటు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌ను కూడా ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేసింది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ అధికారులు.. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న ఆ వ్యక్తులను గుర్తించారు. వారికి రూ.10వేల జరిమానా విధించారు.

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..