AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lions Hunt Video: మొసలిని వేటాడిన సింహాల గుంపు.. కేవలం ఒక్క నిమిషంలో వర్క్ కంప్లీట్.. !

జాంబియాలోని కఫ్యూ నేషనల్ పార్క్‌లోని బుసంగా మైదానాల్లో చోటుచేసుకున్న ఘటన ఇది. సింహాల గుంపు కేవలం 1 నిమిషంలో ఒక పెద్ద మొసలిని చంపాయి. దీనికి సంబంధించినది అంతా న్యూటన్ ములెంగా అనే టూర్ గైడ్ కెమెరాలో బంధించాడు. దీని క్లిప్ ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది.

Lions Hunt Video: మొసలిని వేటాడిన సింహాల గుంపు.. కేవలం ఒక్క నిమిషంలో వర్క్ కంప్లీట్.. !
Lions Hunt Crocodile
Janardhan Veluru
|

Updated on: Nov 22, 2023 | 5:33 PM

Share

అడవిలో వేటగాళ్లదే ఆధిపత్యం! అత్యంత భయంకరమైన వేటగాడు ‘అడవి రాజు’ (సింహం). దాని ఒక్క గాండ్రింపు మొత్తం అడవిని దద్దరిల్లేలా చేస్తుంది. సహజంగా సింహాలు అటవిలోని జింకలు, జీబ్రా, అడవి గేదె తదితరాలను వేటాడతాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సింహాల గుంపు మొసలిని వేటాడి పట్టుకుని ఆరగించడం ఈ వైరల్ వీడియోలో రికార్డు అయ్యింది.

జాంబియాలోని కఫ్యూ నేషనల్ పార్క్‌లోని బుసంగా మైదానాల్లో చోటుచేసుకున్న ఘటన ఇది. సింహాల గుంపు కేవలం 1 నిమిషంలో ఒక పెద్ద మొసలిని చంపాయి. దీనికి సంబంధించినది అంతా న్యూటన్ ములెంగా అనే టూర్ గైడ్ కెమెరాలో బంధించాడు. దీని క్లిప్ ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో 1.31 నిమిషాల నిడివి ఉంది. ఇందులో సింహాల గుంపు మొసలిని వేటాడటం మనం చూడవచ్చు. మొసలి తనను తాను రక్షించుకోవడానికి విఫలయత్నం చేస్తోంది. కానీ సింహాల బలం ముందు అది తలవంచక తప్ప లేదు. సింహాల గుంపు ధాటికి కేవలం ఒక్క నిమిషంలోనే మొసలి చనిపోయింది.. వాటికి ఆహారం అయ్యింది.

గతంలో సింహాల వేటకు సంబంధించి చాలా వీడియోలు చూసినా.. ఇలాంటి వీడియోను ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూశాక సింహం అడవికి రారాజు అని ఎందుకు అంటారో అర్ధమయిపోతుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మొసలిని వేటాడిన సింహాల గుంపు.. వీడియో

బుసంగా మైదానం Kafue నేషనల్ పార్క్ ఉత్తర భాగంలో ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ. ఆ ప్రాంతం వన్యప్రాణుల కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుంది. ఇది చిత్తడి నేలకు ప్రసిద్ధి చెందింది. అక్కడి బురద కుంటల్లో మొసళ్లు జీవిస్తుంటాయి. నీరు తాగేందుకు వచ్చే వన్యప్రాణులను అవి వేటాడుతుంటాయి. ఆ కుంటల్లో ఏ మాత్రం నీరు తగ్గినా మొసళ్లు వన్యప్రాణులకు ఆహారం అవుతుంటాయి.