Visakhapatnam Accident: విశాఖ ఆటో ప్రమాదం.. ఆ రియల్ హీరోలకు పేరెంట్స్ సలాం..! వాళ్లు స్పందించకుంటే..
ఉదయం 7.35గంటలు.. రోడ్లపై అప్పుడప్పుడే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఎవరి గమ్య స్థానాలకు వెళ్లే పనిలో వాహనదారులున్నారు. ఇంతలో భారీ శబ్దం.. రెప్పపాటులో ఆటో బోల్తా.. స్కులు పిల్లలు రోడ్డుపై పడి హాహాకారాలు..! చుసిన వారిలో కొంతమంది చలించి పరుగులు తీసారు. పిల్లలను రెస్క్యూ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ కొంతమంది విద్యార్థుల శరీరం నుంచి రక్తం కారుతుంది. మరి కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు.
ఉదయం 7.35గంటలు.. రోడ్లపై అప్పుడప్పుడే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఎవరి గమ్య స్థానాలకు వెళ్లే పనిలో వాహనదారులున్నారు. ఇంతలో భారీ శబ్దం.. రెప్పపాటులో ఆటో బోల్తా.. స్కులు పిల్లలు రోడ్డుపై పడి హాహాకారాలు..! చుసిన వారిలో కొంతమంది చలించి పరుగులు తీసారు. పిల్లలను రెస్క్యూ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ కొంతమంది విద్యార్థుల శరీరం నుంచి రక్తం కారుతుంది. మరి కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. అందరూ ఆటో ప్రమాదంలో పడిన వారిని రెస్క్యూ చేస్తున్నారే తప్ప.. వైద్య సాయం కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు. అటువైపు వాహనాలు వెళుతున్నాయి ఆటోలు, కార్లు కూడా నడుస్తున్నాయి. కానీ ఎవరు ఆపలేదు. దీంతో అప్పుడే ఇద్దరు రియల్ హీరోలుగా మారారు. గాయాలతో రక్తం కారుతున్న పిల్లలను కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఘటన జరిగాక.. ఆటోలో పిల్లల రోదనలు మిన్నంటాయి.. చూసినవారు కూడా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే రెప్పపాటులో జరిగిన ఆ ప్రమాదం ఆ స్థాయిలో ఉంది. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు.. మరి కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. కానీ.. ఏదైనా వాహనాన్ని ఆపి గానీ, తమ సొంత వాహనాల్లో తరలించే ఏర్పాటు గానీ చేయలేదు. అదే సమయంలో.. ఓ వ్యక్తి అటుగా కారులో వస్తూ ఘటన చూసి చలించిపోయాడు. మరో వ్యక్తి గమ్యస్థానానికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. పిల్లల హాహాకారాలు చూసి బస్సులోంచి దిగిపోయాడు. ఇద్దరూ కలిసి.. కారులో తీవ్ర గాయాల పాలైన వారిని ఎక్కించుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య అందేలా చేశారు.
అతనే కనుక లేకుంటే…!
స్కూలు ఆటో ప్రమాద సమయంలో క్షతగాత్రులను సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించారు ఇద్దరు రియల్ హీరోలు. గాయపడి హాహాకారాలు చేస్తున్న పిల్లలను తన కారులో ఆసుపత్రికి తరలించారు వెంకట్రావు. ఓ హోటల్లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు వెంకట్రావు. వెంకటరావు పనిచేస్తున్న హోటల్కు దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. డ్యూటీకి వెళ్తున్న వెంకటరావు.. జనాలు గుమికూడి ఉండడం చూశాడు. ఇంకాస్త ఏకాగ్రతతో చూసేసరికి.. ఆటో బోల్తా పడి ఉంది. ఆ పక్కనే పిల్లలు ఏడుస్తున్నారు. ఇంతలో సిగ్నల్ క్రాస్ చేసిన వెంకటరావు.. స్పాట్ కు చేరుకొని.. కారును ఆపాడు. అప్పటికే అత్యవసరసాయం అవసరం అనుకున్న నలుగురిని పికప్ చేసి.. కారులో ఎక్కించుకొని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి చేరాడు. అక్కడ వారిని అడ్మిట్ చేస్తూనే.. తన హోటల్కు కాల్ చేసి.. మరో కారును స్పాట్ కు పంపారు వెంకట్రావు. అక్కడ నుంచి మరో ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. వెంకట్రావు సకాలంలో స్పందించడంతో.. తీవ్ర గాయాలపాలైన హాసినిప్రియకు సకాలంలో వైద్యులు వైద్య సాయం అందించగలిగారు. మిగిలిన వారికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచారు.
వెళ్తున్న బస్సులో నుంచి దిగి సాయం చేసిన శివ..
ఆటో ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో మరో వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. అతని పేరు శివ. జీవీఎంసీ లో ఉద్యోగం చేస్తున్న శివ.. భీమిలి వైపు వెళ్తున్నాడు. ఎన్ఏడి జంక్షన్ లో ఆర్టీసీ బస్సు ఎక్కి.. కాంప్లెక్స్ లో దిగి మరో బస్సులో గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంది. అయితే.. తాను వెళుతున్న బస్సులో నుంచి.. ఆటో ప్రమాదాన్ని చూశాడు. ఆటో ఢీకొన్న లారీ వెనకే ఆర్టీసీ బస్సు కూడా వస్తోంది. వెళ్తున్న బస్సును ఆపి అందులోంచి దిగాడు శివ. బస్సు ఆగినప్పటికీ ఎవరూ కూడా దిగి సహాయం చేసే సాహాసం చేయలేదు. వెంటనే బస్సు లోంచి దిగిన శివ హుటా హుటానా స్పాట్ కు పరిగెత్తాడు. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న వెంకటరావుకు సహకారం అందించాడు శివ. గాయాలతో హాహాకారాలు చేస్తున్న విద్యార్థులను తమ చేతులతో కారులో ఎక్కించారు. ఆటోలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. స్థానికులు కూడా కొంతమంది సహకారం అందించారు.
సకాలంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు వారిని వైద్యులు వారిని అభినందించారు. అంతేకాదు.. పోలీసులకు పేరెంట్స్ కూడా సమాచారాన్ని అందించారు. ప్రమాద దృశ్యాలు కలచివేశాయని.. గాయాలతో భయానక పరిస్థితుల్లో ఉన్న పిల్లలను శివ సహకారంతో తరలించానని అంటున్నరు వెంకాట్రావు. ఘటన జరిగిన వెంటనే.. సాధ్యమైనంత త్వరగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చాలని.. ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఇద్దరు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేసేలా పిల్లలని పంపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పేరెంట్స్కు సూచిస్తున్నారు వెంకటరావు, శివ.. స్కూలు యాజమాన్యాలు కూడా పేరెంట్స్ తో మాట్లాడి అవగాహన తీసుకురావాలని కోరుతున్నారు.
తమ పిల్లలను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిలా చేసిన మా ఇద్దరికీ రుణపడి ఉంటామంటున్నారు బాధ్యత పేరెంట్స్. నిజంగా సకాలంలో ఇద్దరు సహృదయంతో స్పందించకుంటే.. గాయాలతో విద్యార్థులకు వైద్యం అందుకుంటే.. పరిస్థితి ఏమైందో ఊహించుకోవడానికే భయంగా ఉంటుందని అంటున్నారు వెంకటరావు, శివ సేవా భావాన్ని తెలూసుకున్న మరి కొంతమంది. రియల్ హీరోలంటూ అభినందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..