India vs Australia 1st T20: నేడు విశాఖలో భారత్- ఆస్ట్రేలియా T20 మ్యాచ్.. వరుణుడు అడ్డింకిగా మారతాడా

వరల్డ్ కప్ ఫైనల్‌లో పరాజయం చవిచూసిన, ప్రత్యర్ధి ఆస్ట్రేలియాతో టీం ఇండియా మరోసారి యుద్ధానికి సిద్దమైంది. వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజుల్లోనే ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ జరుగుతుండటం, తొలి మ్యాచ్‌కు విశాఖ వేదిక కావడంతో క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా- టీం ఇండియాతో మొత్తం ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. రాత్రి ఏడు గంటలకు విశాఖలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 మ్యాచ్ కావడంతో సహజంగానే క్రికెట్ ఫ్యాన్స్‌లో..

India vs Australia 1st T20: నేడు విశాఖలో భారత్- ఆస్ట్రేలియా T20 మ్యాచ్.. వరుణుడు అడ్డింకిగా మారతాడా
India Vs Australia 1st T20 Match
Follow us
Eswar Chennupalli

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 23, 2023 | 12:34 PM

విశాఖ, నవంబర్‌ 23: వరల్డ్ కప్ ఫైనల్‌లో పరాజయం చవిచూసిన, ప్రత్యర్ధి ఆస్ట్రేలియాతో టీం ఇండియా మరోసారి యుద్ధానికి సిద్దమైంది. వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజుల్లోనే ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ జరుగుతుండటం, తొలి మ్యాచ్‌కు విశాఖ వేదిక కావడంతో క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా- టీం ఇండియాతో మొత్తం ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. రాత్రి ఏడు గంటలకు విశాఖలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 మ్యాచ్ కావడంతో సహజంగానే క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉంటుంది.

ప్రధాన ప్లేయర్లు లేకుండానే విశాఖ చేరుకున్న జట్లు వరల్డ్ కప్‌లో వరుసగా నాకౌట్ వరకు 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లో తృటిలో కప్ చేజారిన భారత్ ఈ టీ20కి మాత్రం సీనియర్లకు విశ్రాంతి నిచ్చింది. హార్దిక్ పాండ్యకు గాయాలు కావడంతో సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఆస్ట్రేలియా కూడా నలుగురు ప్రధాన ప్లేయర్లకు విశ్రాంతిని ఇచ్చింది. స్వల్ప మార్పులతో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్‌ గెలిచిన విశ్వాసంతో ఆస్ట్రేలియా ఉండగా, వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడినా నిరాశ పడకుండా ఈ టీ 20 సిరీస్ ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తుంది. భారత్ కొత్త ప్రయోగమే చేస్తుందని చెప్పాలి. మొత్తం యువ జట్టునే రంగంలోకి దించుతోంది.

భారత్ జట్టులో.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్) ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ , ప్రసిద్ద్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా జట్టులో.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ ఉన్నారు. రెండు జట్లు ఈ సిరీస్ ను తమ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

ఇరు జట్ల నెట్ ప్రాక్టీస్ – విశాఖలో భారీ ఏర్పాట్లు

నేడు విశాఖలో జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టీ-20 తొలి మ్యాచ్ కి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలను పూర్తి చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మధురవాడ స్టేడియం బయట భారీ ఎత్తున బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్ ఆరంభించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాలుగు రోజుల క్రితమే విశాఖ చేరుకుని రోజూ సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ నెట్ ప్రాక్టీస్ గురువారం కూడా కొనసాగనుంది.

ట్రాఫిక్ ఆంక్షలు

మ్యాచ్ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు జరగనుంది. సాయంత్రం 4 నుంచి మ్యాచ్ జరగనున్న మధురవాడ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను చేపట్టారు. టికెట్ ఉంటేనే 4 వీలర్, టూ వీలర్ లను ఆ మార్గంలో అనుమతిస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

వర్షం పడే ఛాన్స్…

విశాఖ లో నేడు వాతావరణం మబ్బుతో కూడి ఉన్నప్పటికి అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ ఫోర్ క్యాస్ట్ చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్టవుతుంది. ఈ సమయానికి వర్షం పడుతుందన్న సూచనలు అందడంతో టాస్ ఆలస్యమయ్యే ఛాన్సులు ఉన్నాయి. దీంతో వర్షం పడితే మ్యాచ్ నిలచిపోతే మనకు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని మిస్ అవుతామోనన్న  బెంగ  స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఉంది. గత రెండు రోజులుగా నెట్ ప్రాక్టీస్ కు చిరుజల్లులు పడ్డా పెద్ద ఇబ్బంది కలగలేదు. మ్యాచ్ సమయంలో మాత్రం వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు వరుణదేవుడిని ప్రార్థిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.