SBI Recruitment 2023: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5,447 ఉద్యోగాలు.. నేటి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో రెగ్యులర్ ఖాళీలు 5,280, బ్యాక్‌లాగ్ ఖాళీలు 167 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి..

SBI Recruitment 2023: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5,447 ఉద్యోగాలు.. నేటి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
SBI CBO Recruitment 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2023 | 10:15 AM

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో రెగ్యులర్ ఖాళీలు 5,280, బ్యాక్‌లాగ్ ఖాళీలు 167 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం లేద సర్కిల్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, హైదరాబాద్, జైపుర్, లఖ్‌నవూ, కోల్‌కతా, మహారాష్ట్ర, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్‌ ఈస్ట్రన్‌, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, తిరువనంతపురం.. సర్కిళ్లలో ఈ నోటిఫికేషన్‌ కింద పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీలో అర్హత కలిగి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 31, 2023 నాటికి అభ్యర్దుల వయోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 12, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (నవంబర్ 22) నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు సంబంధిత సర్కిల్‌లలో ఉద్యోగ విధులు నిర్వహించవల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారు నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్‌ 22. 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 12. 2023.
  • అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీ: జనవరి 2024 నుంచి.
  • ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2024 నుంచి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!