EMRS Exam Dates: ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 10,391 ఉపాధ్యాయ ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది. నెస్ట్స్‌ ప్రకటించిన తేదీ ప్రకారం.. డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి కలిగిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌)..

EMRS Exam Dates: ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 10,391 ఉపాధ్యాయ ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల
EMRS Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2023 | 10:36 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 22: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద 10,391 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది. నెస్ట్స్‌ ప్రకటించిన తేదీ ప్రకారం.. డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి కలిగిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) సంస్థ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉద్యోగ నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నోటిఫికేషన్‌ కింద పీజీటీ, జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్, ప్రిన్సిపల్, ల్యాబ్‌ అసిస్టెంట్‌, టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 19, 2023వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఉద్యోగ ఖాళీల వివరాలు..

  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు: 5,660
  • హాస్టల్ వార్డెన్ (పురుషులు) పోస్టులు: 335
  • హాస్టల్ వార్డెన్ (మహిళలు) పోస్టులు: 334
  • ప్రిన్సిపల్ పోస్టులు : 303
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు: 2,266
  • అకౌంటెంట్ పోస్టులు: 361
  • జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు: 759
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 373
  • మొత్తం ఖాళీలు పోస్టుల సంఖ్య10,391

ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌కు రేపటితో ముగుస్తోన్న గడువు

ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సీట్ల భర్తీకి సీపీగెట్‌ 2023 చివరి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టికను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి మంగళవారం(నవంబర్‌ 21) విడుదల చేశారు. సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు నవంబర్‌ 23వ తేదీ వరకు ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీరిందరికీ నవంబర్‌ 26న సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.