TS Law cet 2023 Counselling: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తెలంగాణ లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించారు. దరఖాస్తు గడువు మంగళవారం (నవంబర్ 21)తో ముగియనుండగా దానిని మరో రెండు రోజులు పొడిగించారు. కాకతీయ యూనిర్సిటీ డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడం వల్ల..
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించారు. దరఖాస్తు గడువు మంగళవారం (నవంబర్ 21)తో ముగియనుండగా దానిని మరో రెండు రోజులు పొడిగించారు. కాకతీయ యూనిర్సిటీ డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడం వల్ల అభ్యర్థుల వినతి మేరకు రెండు రోజులు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మొదటి విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 30వ తేదీన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ అనంతరం డిసెంబరు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్‌బాబు ఈ సందర్భంగా వెల్లడించారు. మంగళవారం నాటికి ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాలతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సుమారు 13 వేల మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కన్వినర్ చెప్పారు. ఆ మూడు కోర్సుల్లో ఇంకా సుమారు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.
పెరిగిన సీట్ల సంఖ్య
రాష్ట్రంలో ఏటా లా కోర్సులకు డిమాండ్ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలోని పలు లా కాలేజీలు అదనపు సెక్షన్లకు అనుమతులు తెచ్చుకొన్నాయి. దీంతోపాటు హనుమకొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు బీసీ గురుకుల లా కాలేజీలు ప్రారంభంకానున్నాయి. వీటిల్లో ఒక్కో గురుకుల లా కాలేజీలో 60 సీట్ల చొప్పున అదనంగా లభించనున్నాయి. దీంతో మొత్తం 300 పైగా సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని కన్వినర్ తెలిపారు.
తొలివిడత లా సెట్ కౌన్సెలింగ్ హెడ్యూల్ ఇదే..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తుది గడువు: నవంబర్ 23, 2023.
- అర్హులైన వారి జాబితా ప్రకటన తేదీ: నవంబర్ 24, 2023.
- వెబ్ ఆప్షన్ల నమోదు గడువు: నవంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు, 2023.
- వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ తేదీ: నవంబర్ 27, 2023.
- సీట్ల కేటాయింపు తేదీ: నవంబర్ 30, 2023.
- కాలేజీల్లో రిపోర్టింగ్ చేసేందుకు గడువు: డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు, 2023.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.