Job Alerts: యువతకు గుడ్ న్యూస్.. 3000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ముందుకొచ్చిన దిగ్గజ సంస్థ
ముంబైకి చెందిన దిగ్గజ సంస్థ టైటాన్. ఇది టాటా గ్రూప్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. టైటాన్ వాచ్ , తనిష్క్ జ్యూవెలర్స్ పేరుతో ప్రపంచ మార్కెట్లో విస్తరించింది. రానున్న ఐదేళ్ల కాలంలో తన సంస్థ రూ. 1,00,000 కోట్ల బిజినెస్ ను చేరుకోవాలనే లక్ష్యంతో సరికొత్త ఆలోచనకు తెరలేపింది. టైటాన్ కంపెనీలో ఇంజనీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ వంటి విభాగాలతో పాటూ
ముంబైకి చెందిన దిగ్గజ సంస్థ టైటాన్. ఇది టాటా గ్రూప్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. టైటాన్ వాచ్ , తనిష్క్ జ్యూవెలర్స్ పేరుతో ప్రపంచ మార్కెట్లో విస్తరించింది. రానున్న ఐదేళ్ల కాలంలో తన సంస్థ రూ. 1,00,000 కోట్ల బిజినెస్ ను చేరుకోవాలనే లక్ష్యంతో సరికొత్త ఆలోచనకు తెరలేపింది. టైటాన్ కంపెనీలో ఇంజనీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ వంటి విభాగాలతో పాటూ డిజిటల్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులను ఎంపిక చేసుకోవాలని భావిస్తోంది.
ఇలా అన్ని రకాల్లో మంచి ప్రతిభ కలిగిన వాళ్లను ఎంపిక చేసుకుని లాభాలే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తతం పని చేస్తున్న సిబ్బందితో యువకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఉన్న తన సొంత సిబ్బందితో పాటూ కొత్తగా తీసుకున్న వారిని జత చేసి మంచి ఆవిష్కరణలు చేపట్టాలని ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్ని స్వయంగా టైటాన్ గ్రూప్ హ్యూమన్ రిసోర్స్ హెడ్ ప్రియా ఎం.పిళ్లై వెల్లడించారు.
ప్రస్తుత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను అభివృద్దిపదంలోకి తీసుకెళ్లేందుకు సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. స్థానికంగా ఉండే నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొత్త వారికి ప్రోత్సాహకాలు అందించాలి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 60:40 అనే నిష్పత్తిలో నియామకాలను చేపట్టింది. టైటాన్ సంస్థలో పనిచేసే సిబ్బంది 60శాతం మంది మెట్రో నగరాల్లో సేవలందిస్తుండగా.. 40శాతం మంది టైర్ 2,3 నగరాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపింది. రానున్న రోజుల్లో వినియోగదారులను ఆకర్షించేలా తమ సంస్థ సేవలు అందిస్తుందని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..