Car Offers: ఈ కార్లపై క్రేజీ ఆఫర్స్.. ఏకంగా రూ. 1.5లక్షల వరకూ తగ్గింపు.. మిస్ చేసుకోవద్దు..
కారు వంటి హై బడ్జెట్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా తగ్గింపులు, బ్యాంకు ఆఫర్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉండే సందర్భాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం పండుగ ఆఫర్లలో భాగంగా పలు కంపెనీలు, డీలర్లు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అలాగే పలు బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కారు కొనాలనే ప్లాన్లో ఉన్నారా? లేదా మీ పాత కారును అప్ గ్రేడ్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ నెలలో పలు కంపెనీలు, డీలర్లు పలు కంపెనీల కార్ల అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్, బ్యాంకు ఆఫర్లు ఉన్నాయి. అంతేకాక పలు బ్యాంకులు కార్ లోన్లను సరసమైన వడ్డీ రేట్లకే అందిస్తున్నాయి. ఈ చాన్స్ మీరు సద్వినియోగం చేసుకోకపోతే మళ్లీ మళ్లీ ఇలాంటి ఆఫర్లు దొరకపోవచ్చు. మీరు ఎప్పుడు కారు వంటి హై బడ్జెట్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా తగ్గింపులు, బ్యాంకు ఆఫర్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉండే సందర్భాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం పండుగ ఆఫర్లలో భాగంగా పలు కంపెనీలు, డీలర్లు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అలాగే పలు బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే మార్కెట్లో డిమాండ్ ఉన్న కార్లపై మాత్రం ఈ ఆఫర్ల ఆశించకపోవడం మంచిది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మిడ్ సైజ్ సెడాన్ కార్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఈ కార్ ఆఫర్లు నెలాఖరు వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి.
పాత కారు ఎక్స్ చేంజ్ చేస్తే..
మీరు ఇప్పటికే కారుని కలిగి ఉన్నట్లయితే, మీరు లాయల్టీ బోనస్‌కు అర్హులు అవుతారు. ఆ విషయాన్ని మీరు తయారీదారునితో మాట్లాడి నిర్ధారించుకోవచ్చు. సాధారణంగా, తయారీదారులు తమ ప్రస్తుత కస్టమర్‌లను తమతో ఉంచుకోవడానికి లాయల్టీ బోనస్‌లను అందిస్తారు. మీకు ఇప్పటికే కారు ఉంటే, డీలర్ మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందించవచ్చు. చాలా మంది ప్రజలు తమ పాత వాహనాలను విక్రయించే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఇష్టపడతారు. అయితే వారు పాత వాహనానికి అత్యుత్తమ విలువను అందించకపోవచ్చు. ఎక్స్ఛేంజ్లో మంచి డీల్ పొందడానికి, మీరు కారుకు సరైన ధర ఏమిటో తెలుసుకోవాలి. మీరు కార్స్24, కార్ వాలే, ఎకో డ్రైవ్ వంటి సెకండ్ హ్యాండ్ కార్ యాప్ లను సంప్రదించి మీ కారు విలువను ముందుగానే తనిఖీ చేయొచ్చు. అలా మీరు మీ కారు విలువను ముందుగా అంచనా వేసిన తర్వాత దానితో డీలర్ రేటును సరిపోల్చి ఎక్కువ ఇచ్చే చోట దానిని మార్చుకోవచ్చు.
కొత్త కార్లపై ఆఫర్లు..
హోండా సిటీ పెట్రోల్.. ఈ కారు కొనుగోలుపై మీరు ఏకంగా రూ.88,000 మేర ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో రూ. 25,000 వరకూ నగదు తగ్గింపు, రూ. 15,000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 5,000 వరకూ కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4000 లాయల్టీ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే రూ. 13,000 విలువైన ఐదేళ్ల వారంటీ ప్యాకేజీ సిటీ వీఎక్స్, జెడ్ఎక్స్ మోడళ్లపై లభిస్తోంది. అదనంగా
హోండా సిటీ హైబ్రిడ్.. ఈ వీ సీవీటీ హై బ్రిడ్ మోడల్ పై రూ. లక్ష వరకూ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
హ్యుందాయ్ వెర్నా.. ఈ కారు కొనుగోలుపై రూ. 25,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. అలాగే ఎక్స్ చేంజ్ బోనస్ గా రూ. 20,000 పొందొచ్చు.
స్కోడా స్లావియా.. ఈ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 1.5 లక్షల ప్రయోజనాలు పొందొచ్చు. వీటిల్లో ఎక్స్ చేంజ్, కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఈ కారును కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. లక్ష వరకూ ప్రయోజనాలను పొందొచ్చు. వాటిల్లో ఎక్స్ఛేంజ్, కార్పొరేట్, వీడబ్ల్యూ వర్టస్ వేరియంట్లపై డిఫరెన్షియల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
హోండా అమేజ్.. ఈ కారుపై మీరు రూ. 67,000 వరకూ ప్రయోజనాలు పొందొచ్చు. వీటిల్లో రూ. 25,000 వరకు డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 4,000 లాయల్టీ బోసన్ ఉంటుంది. అదనంగా ఎంపిక చేసిన ప్రొఫైల్ కస్టమర్లకు రూ. 20,000 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది.
హ్యుందాయ్ ఆరా.. ఈ కారు కొనుగోలు చేస్తే పెట్రోల్ వెర్షన్ పై మీకు రూ. 10,000, సీఎన్జీ వెర్షన్ పై రూ. 20,000 తగ్గింపు లభిస్తుంది. అదనంగా రూ. 10,000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోనస్ లభిసతుంది.
టాటా టిగోర్ పెట్రోల్.. ఈ కారుపై మీకు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా రూ. 15,000 ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్ లు ఉంటాయి.
టాటా టిగోర్ సీఎన్జీ.. ఈ కారు కొనుగోలుపై మీకు రూ. 50,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. అలాగే ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 20,000, కార్పొరేట్ బోనస్ కింద రూ. 5000 తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..