Uttar Pradesh: కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన యువకుడు.. ఎమర్జెన్సీ వార్డ్‌బెడ్‌పై పామును ఉంచి వైద్యం చేయాలంటూ వేడుకోలు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తనను కరచిన పామును సంచిలో భద్రంగా ఆసుపత్రికి తీసుకొచ్చి.. వైద్యం చేయాలంటూ ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. సంచిలోనుంచి పామును బయటికి తీసి దానిని వైద్యులకు చూపుతూ తనను కరచిన పాము ఇదేనంటూ నాగుపామును చూపసాగాడు. వెంటనే తనకు ఇంజెక్షన్‌ చేయాలంటూ సదరు యువకుడు హల్‌చల్‌ చేసిన ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా..

Uttar Pradesh: కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన యువకుడు.. ఎమర్జెన్సీ వార్డ్‌బెడ్‌పై పామును ఉంచి వైద్యం చేయాలంటూ వేడుకోలు!
Man Bitten By Cobra Creates Panic In Hospital
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2023 | 7:50 AM

మీర్జాపుర్‌, నవంబర్‌ 22: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తనను కరచిన పామును సంచిలో భద్రంగా ఆసుపత్రికి తీసుకొచ్చి.. వైద్యం చేయాలంటూ ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. సంచిలోనుంచి పామును బయటికి తీసి దానిని వైద్యులకు చూపుతూ తనను కరచిన పాము ఇదేనంటూ నాగుపామును చూపసాగాడు. వెంటనే తనకు ఇంజెక్షన్‌ చేయాలంటూ సదరు యువకుడు హల్‌చల్‌ చేసిన ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా నిలిచింది. ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లోని లాల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్‌ అనే యువకుడిని అతని ఇంటివద్ద సోమవారం సాయంత్రం ఓ నాగుపాము కాటు వేసింది. సూరజ్‌ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించాడు. అనంతరం ఆ పాము ఉన్న సంచిని తీసుకుని సమీపంలోని మీర్జాపుర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్‌పై వెళ్లాడు. వెంటనే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తానను పాము కాటు వేసిందని వెంటనే వైద్యం చేయాలంటూ డాక్టర్లను కోరాడు. అతన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాధితుడు నీట్‌గా సూటుబూటు వేసుకుని టిప్‌టాప్‌గా వచ్చాడు మరీ.

వెంటనే తన వద్ద ఉన్న సంచిలోనుంచి పామును తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్‌పై ఉంచి ‘ఈ పామే నన్ను కరిచింది’ అంటూ వివరించసాగాడు. అనంతరం ఆ పామును తిరిగి సంచిలో భద్రపరిచాడు. అనుకోని ఈ హఠత్పరిణామానికి ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, స్టాఫ్‌తో సహా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. పామును చూపి తక్షణమే తనకు ఇంజెక్షన్‌ ఇవ్వాలని సూరజ్‌ వైద్యులను కోరాడు. అనంతరం సూరజ్‌కు వైద్యులు యాంటీవీనమ్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి, చికిత్స చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్