AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం అకస్మత్తుగా ముక్కలైంది.. 94 మంది ప్రాణాలు సురక్షితం..? ఎలాగంటే..

24,000 అడుగుల ఎత్తు నుండి దెబ్బతిన్న విమానాన్ని అమాంతంగా కిందకు తీసుకువచ్చాడు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 95 మందిలో ఒక ఎయిర్ హోస్టెస్ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఒక ప్రయాణికుడు విమానం ఎక్కేటప్పుడు విమానంలో పగుళ్లను గమనించాడని, అయితే టేకాఫ్ చేయడానికి ముందు అతడు తను చూసిన విషయం సిబ్బందికి చెప్పలేదని తెలిసింది.

24 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం అకస్మత్తుగా ముక్కలైంది.. 94 మంది ప్రాణాలు సురక్షితం..? ఎలాగంటే..
Plane Crash
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2023 | 7:03 PM

Share

సైకిల్ నుండి విమానం వరకు ప్రయాణించే వాహనం ఏదైనా సరే.. దానిని నడపడంలో నైపుణ్యం ఉంటే సరిపోదు. క్లిష్ట పరిస్థితి ఏర్పడి, జీవితం మృత్యువును సమీపిస్తున్న సమయంలో దానిని ఎలా నివారించగలం అనేదే పెద్ద విషయం. 35 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. విమానం కూలిపోవడంతో 95 మంది ప్రాణాలు అపాయంలో పడగా, పైలట్ అనూహ్యమైన తెలివితేటలు ప్రదర్శించి ప్రాణాపాయం నుంచి తప్పించాడు. ప్రమాదానికి గల కారణాల విషయానికి వస్తే.. 24 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా రెండు ముక్కలైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 18న ‘X’కి చెందిన మోత్రా అనే హ్యాండ్లర్ ఈ ఫోటోలను షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్‌ అవుతున్న ఫోటోలు చూస్తుంటే.. గాలిలో ఎగురుతున్న విమానం పైభాగం అకస్మాత్తుగా ఎగిరిపోయింది. సిబ్బందితో సహా ఇతర ప్రయాణికులందరూ భయంతో వణికిపోతున్నారు.1988 ఏప్రిల్ 28న అమెరికన్ అలోహా ఎయిర్‌లైన్స్ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. రెండు ఇంజన్లు, 110 సీట్లతో న్న బోయింగ్ 737-200 జెట్ విమానంలో 89 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా క్యాబిన్‌లో అంతర్గత ఒత్తిడి పెరిగింది. బాహ్య గాలి పీడనం చాలా ఎక్కువగా తాకుతోంది. దాంతో విమానం పై కప్పుకు చిన్న రంధ్రంతో మొదలై, క్రమంగా విమానం పై భాగం పూర్తిగా విడిపోయిందని తెలిసింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన సిబ్బంది, ప్రయాణీకులు కేకలు వేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కెప్టెన్ మొదటి అధికారి నుండి నియంత్రణలను తీసుకున్నాడు. 13 నిమిషాల తర్వాత పైలట్ ధైర్యంగా వ్యవహరించాడు. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌.. ఇంజిన్ బర్నింగ్‌తో 24,000 అడుగుల ఎత్తు నుండి దెబ్బతిన్న విమానాన్ని అమాంతంగా కిందకు తీసుకువచ్చాడు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 95 మందిలో ఒక ఎయిర్ హోస్టెస్ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఒక ప్రయాణికుడు విమానం ఎక్కేటప్పుడు విమానంలో పగుళ్లను గమనించాడని, అయితే టేకాఫ్ చేయడానికి ముందు అతడు తను చూసిన విషయం సిబ్బందికి చెప్పలేదని తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..