Andhra Pradesh: ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గా..
Kadapa: దేశ నలుమూలల నుంచి అనేకమంది ముస్లింలు ఇక్కడకు వచ్చి ఉరుసు ఉత్సవంలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. అమీన్ పీర్ దర్గా దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. కుల మతాలకు అతీతంగా అమీన్ పీర్ దర్గాను దర్శించుకునేందుకు అనేక మంది వస్తుంటారు. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. అంతేకాదు ఎంతోమంది ప్రముఖులు కూడా కడప దర్గాను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. ముఖ్యంగా సినీ తారలు పెద్ద సంఖ్యలో అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారు.
కడప, నవంబర్24; ప్రపంచంలో ముస్లింలకు మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా భావించే కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ముస్లిం మత పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి అనేకమంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఉరుసు ఉత్సవంలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు.. కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గా దేశంలోనే అత్యంత ప్రాచుర్యం చెందింది. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఎంతోమంది ప్రముఖులు కడప దర్గాను దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ తారలు అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు.
అమీన్ పీర్ దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలు ఈ ఏడాది ఈనెల 25వ తారీకు నుంచి వచ్చే నెల ఒకటవ తేది వరకు ఘనంగా జరపడానికి నిర్వాహకులు, అధికారులు దర్గాను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ ఉరుసు ఉత్సవాలలో ముఖ్యంగా గంధము ఉత్సవము ఉరుసు ఉత్సవము ముషాయిరాలు చాలా ప్రాధాన్యం. ఈనెల 26వ తేదీన గంధము ఉత్సవము, 27న ఉరుసు ఉత్సవము, 28న ముషాయిరాలు నిర్వహించనున్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు సర్ గిరోలు ఫకీర్లు ఊరేగింపుతో దర్గా షరీఫ్ కు వచ్చి చదివింపులు ఇచ్చి అక్కడ బస చేయడం నుంచి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఉరుసు చదివింపులు ప్రారంభమై బ్యాండ్ భాజాలతో ఊరేగింపుగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దర్గాలోని మహనీయుల సమాధుల వద్ద చదివింపులు చదివిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ ఖవ్వాలి విధ్వంసులతో ఖవాలి జరుగుతుంది. అనంతరం 10 గంటలకు పీఠాధిపతి నివాసం నుండి గంధము తీసుకు వస్తారు గురువులు. దేశ నలుమూలల నుంచి వచ్చిన మత గురువులు భక్తులు మేళ తాళాలతో దర్గాకి చేరి హజరత్ వారి సమాధి వద్ద పీఠాధిపతి చేతుల మీదుగా గంధము సమర్పించి ఫతేహా చేస్తారు. ఆ తరువాత 27వ తారీఖున ఉరుసు ఉత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అసారే షరీఫా దర్శనం కల్పిస్తారు. అనంతరం రాత్రి 11 గంటలకు చౌక్ బజార్ నుండి వస్త్ర వ్యాపారులు పోలా చాందిని గంధము, మండి బజారు నుండి ఎద్దుల బండ్ల చౌదరి కలిపాలు చాందిని గంధమును మంగళ వాయిద్యాలతో దర్గాకు తీసుకొని వస్తారు.
ఆ తర్వాతి రోజు 28వ తేదీన రాత్రి పది గంటల వరకు ముషాయిరా నడుస్తుంది. ఉరుసు ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన ఈ మూడు కార్యక్రమాల అనంతరం వచ్చేనెల 1వ తేదీన ఉరుసు ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా ప్రముఖ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ ప్రముఖంగా హాజరవుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..