Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday Puja Tips: శనివారం పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. శనీశ్వరుడికి ఆగ్రహం కలుగవచ్చు

శనివారం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన రోజు. శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. లేకుంటే శనిదేవుడు మీపై కోపగించుకోవచ్చు. శనిదేవుని అసంతృప్తికి గురిచేసే ఎటువంటి తప్పు చేయవద్దు. ఎందుకంటే శని దేవుడిని సంతోషంగా ఉంచడం మనకు చాలా ముఖ్యం. శనిదేవుడు కోపంగా ఉంటే ఎవరైనా అతని జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించాలి.

Saturday Puja Tips: శనివారం పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. శనీశ్వరుడికి ఆగ్రహం కలుగవచ్చు
Lord Shani
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2023 | 6:54 AM

హిందూ మత విశ్వాసాల ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనీశ్వరుడి న్యాయాధిపతి.. కర్మ ప్రధాతగా భావిస్తారు. వ్యక్తి కర్మానుసారం శనీశ్వరుడు కష్ట సుఖాలను ఇస్తాడు. దీని కారణంగా ప్రతి ఒక్కరూ శనీశ్వరుడు అంటే  భయపడతారు. అందుకనే పాప గ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ నమ్మకం నిజం కాదు.. ఎందుకంటే శనిదేవుడు మనిషిని అతని మంచి, చెడు పనుల ఆధారంగా శిక్షిస్తాడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో..  పురోగతికి అన్ని రకాల మార్గాలు తెరవబడతాయి. చెడు పనులు చేస్తే అతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో శిక్షించబడతాడు.

శనివారం శని పూజ ప్రాముఖ్యత:

శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనివారం నాడు శివుని పూజించాలి. శని దేవుడి చెడు దృష్టిలో చూస్తే..  లేదా మీరు మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబ్బు ఖర్చు పెరిగిందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే, శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఇలా చేయండి. ఈ సమస్యలు తొలగిపోతాయి. శనివారం నాడు శని దేవుడికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వలన అన్ని సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.

శనివారం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన రోజు. శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. లేకుంటే శనిదేవుడు మీపై కోపగించుకోవచ్చు. శనిదేవుని అసంతృప్తికి గురిచేసే ఎటువంటి తప్పు చేయవద్దు. ఎందుకంటే శని దేవుడిని సంతోషంగా ఉంచడం మనకు చాలా ముఖ్యం. శనిదేవుడు కోపంగా ఉంటే ఎవరైనా అతని జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించాలి. ఏదైనా నల్ల జంతువుకి లేదా కాకికి  ఆహారం తినిపించాలి.

ఇవి కూడా చదవండి

శనివారం ఏమి చేయకూడదంటే..

  1. శనివారం నాడు మాంసం, మద్యం సేవించడం చాలా అశుభం. శనీశ్వరుడి దృష్టిలో ఇది అనుచితమైన,  పాపపు చర్య. ఇలా చేసే వ్యక్తిని శనీశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు.
  2. శనివారం రోజున బొగ్గు, ఉప్పు, తోలు, బూట్లు, నల్ల నువ్వులు, మినప పప్పు, చీపురు, నూనె, కలప, ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు, లేకపోతే జీవితంలో కష్టాలు తలెత్తుతాయి.
  3. శనివారం తూర్పు, దక్షిణ, ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  4. శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదని నమ్ముతారు. దీని వల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది.
  5. శనివారం పొరపాటున కూడా ఏ బలహీనమైన లేదా నిస్సహాయ వ్యక్తిని అవమానించడం లేదా బాధపెట్టడం చేయకూడదు.
  6. శనివారం ఇలా చేస్తే మీరు శనిదేవుని దృష్టిలో పాపంలో భాగస్వాములే కావచ్చు. అలాంటి వ్యక్తికి శనీశ్వరుడు  కఠినమైన శిక్షను ఇస్తాడు.
  7. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు  కూడా కోపం తెచ్చుకోవచ్చు.
  8. శనివారం పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు. పాలు తాగాల్సి వస్తే దానికి కొద్దిగా పసుపు లేదా బెల్లం కలుపుకోవాలి.
  9. శనివారం నాడు బెండకాయ, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయలు తినకుండా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు