Budha Gochar 2023: ధనుస్సు రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు.. !
ఈ నెల 27వ తేదీన ధనుస్సులోకి ప్రవేశించబోతున్న బుధ గ్రహం దాదాపు ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇదే రాశిలో కొనసాగుతోంది. బుధుడు ధనూ రాశిలో ప్రవేశించడమన్నది అనేక శుభ ఫలితాలకు కారణమవుతుంది. ధనూ రాశి గురువుకు సంబంధించిన రాశి కావడం, ఈ రాశిలో ప్రవేశించిన బుధుడిని గురువు మేషం నుంచి వీక్షించడం వల్ల బుధుడు పూర్ణ శుభుడవుతాడు. అందువల్ల తప్పకుండా రాశులన్నిటికీ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది.
ఈ నెల 27వ తేదీన ధనుస్సులోకి ప్రవేశించబోతున్న బుధ గ్రహం దాదాపు ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇదే రాశిలో కొనసాగుతోంది. బుధుడు ధనూ రాశిలో ప్రవేశించడమన్నది అనేక శుభ ఫలితాలకు కారణమవుతుంది. ధనూ రాశి గురువుకు సంబంధించిన రాశి కావడం, ఈ రాశిలో ప్రవేశించిన బుధుడిని గురువు మేషం నుంచి వీక్షించడం వల్ల బుధుడు పూర్ణ శుభుడవుతాడు. అందువల్ల తప్పకుండా రాశులన్నిటికీ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. విద్య, తెలివితేటలు, సమయస్ఫూర్తి, టెక్నాలజీ, గణితం, అకౌంటెన్సీ, ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వంటి అంశాలకు కారకుడైన బుధుడు ధన కారకుడు, సంతాన కారకుడు, జ్ఞాన కారకుడైన గురువు రాశిలో ప్రవేశించడంవల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మేషం: ఈ రాశివారికి నవమ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాలలో మాట చెల్లుబాటు అవడం, ప్రాభవం పెరగడం జరుగుతుంది. వ్యాపారాలు రకరకాల మార్పులు చెంది లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలున్నాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
వృషభం: ఈ రాశివారికి బుధుడు అష్టమ రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి వ్యవహారమైనా విజ యవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. సమయస్ఫూర్తితో ఎటు వంటి వ్యవహారాన్నయినా చక్కబెట్టడం, ఎటువంటి సమస్యనైనా పరిష్కరిండం జరుగుతుంది. సతీమణికి మంచి అదృష్టం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా సఫలం అవుతారు.
మిథునం: ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొన్ని కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రమోషన్ లేదా పురోగతికి సంబంధించి ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటకం: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఒక విధమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. సమాజంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తెలివితేటలు, ప్రతిభా పాట వాలు బాగా ప్రకాశిస్తాయి. సామాజికంగా కూడా ఒక మేధావిగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. తోబుట్టువులతో ఆశించిన సఖ్యత ఏర్పడుతుంది.
సింహం: ఈ రాశివారికి అయిదవ స్థానంలో బుధుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల్లో పలు కుబడి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం, కుటుంబ సమస్యలను సమయ స్ఫూర్తితో పరిష్కరించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
కన్య: ఈ రాశి నాథుడైన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్లాన్లు ఆచరణలోకి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా హోదా పెరగడం, గుర్తింపు రావడం జరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం ఆశించినంతగా పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది.
తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ ప్రవేశం వల్ల, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావ డంతో పాటు వారితో సఖ్యత కూడా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ మార్గాలు పెర గడం, ఆర్థిక స్థిరత్వం లభించడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. విద్యార్థు లకు చదువుల్లో ఉత్తమ ఫలితాలు అందుతాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం సంపాది స్తారు.
వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యర్థులు, పోటీదార్లు అణగి ఉంటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విద్యార్థులు చదు వుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగు తాయి.
ధనుస్సు: ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాభవం పెరుగుతుంది. ఉద్యోగులు తమకు ఇష్టమైన దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు న్నాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుం టారు.
మకరం: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధుడి వంటి శుభ గ్రహం ప్రవేశించడం వల్ల తప్పకుండా విదేశీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఏ సమస్య వచ్చినా బంధుమిత్రులు అండగా నిలబడతారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు విరివిగా చేసే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెడతారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. ప్రతి రంగంలోనూ ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభి స్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతాయి.
మీనం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు బాగా దగ్గరవుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారు మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో బిజీ పరిస్థితి ఏర్పడుతుంది. సతీమణికి కూడా వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి అభిస్తుంది.