Telangana Election: మరోసారి పాత కాపుల మధ్య పోరు.. చాపకింద నీరులా పుంజుకున్న బీజేపీ
మంథనిలో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే నెలకొంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్పీస్ చేసినా.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. మరోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఇప్పటికే, పోటా పోటీ ప్రచారంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సందిట్టో సడేమియాలా భారతీయ జనతా పార్టీ కూడా వేగంగా పుంజుకుంటుంది.
మంథనిలో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే నెలకొంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్పీస్ చేసినా.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. మరోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఇప్పటికే, పోటా పోటీ ప్రచారంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సందిట్టో సడేమియాలా భారతీయ జనతా పార్టీ కూడా వేగంగా పుంజుకుంటుంది.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో హోరా హోరీ ప్రచారం సాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు, బీజేపీ నుంచి సునీల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జయం సాధిస్తే, మంథనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరుఫున శ్రీధర్ బాబు ఒకరే విజయ కేతనం ఎగురవేశారు. మరోసారి రెండు పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన ఇద్దరు నేతలు బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటికే మూడు పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంథనిలో అభివృద్ధి జరగకుండా, ప్రభుత్వం అడ్డుకుందని శ్రీధరబాబు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం పర్యటించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత శ్రీధర్ బాబు కావడంతో ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు శ్రీధర్ బాబు. అంతేకాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… శ్రీధర్ బాబు సీఎం అవుతారనే ప్రచారం సాగుతుంది.అయితే ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మద్య ఉద్రిక్తత వాతవరణం చోటు చేసుకుంది. దీంతో ఈ ఇద్దరు నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలే పేల్చుతున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మరోసారి విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు శ్రీధర్ బాబు.
ఈ ఐదేళ్లలో మంథని అభివృద్ధికి దూరంగా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధలు తీసుకరాలేదని అంటున్నారు. అంతే కాకుండా.. తాము దాడులు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి మంథని ప్రజలు ఖచ్చితంగా తనను గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ.. పుట్ట మధు.. రెండు విడతల్లో ప్రచారం చేశారు. గ్రామ గ్రామానికి వెళ్తూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పరిస్తున్నారు. శ్రీధర్ బాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తుందని విరుచుకుపడ్డారు.
ఇదిలావుంటే, ఇద్దర మధ్య బీజేపీ మెల్ల మెల్లగా పుంజుకుంటుంది. ఇప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ చూశారని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి. ఈ ఇద్దరు అభ్యర్థులు మంథని గురించి పెట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన సునీల్ రెడ్డి.. ఇంటింటికి వెళ్లి, తనను గెలిపించాలని కోరుతున్నారు. గత ఎన్నికలతో పోలీస్తే, ఈసారి బీజేపీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మరీ, నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో మంథని ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..