ఆఖరి ఘట్టానికి చేరుకున్న తెలంగాణ దంగల్.. మరి రాష్ట్ర ప్రజల తీర్పు ఎటు వైపు..!
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు వచ్చింది. అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. కేంద్రమంత్రులను రంగంలో దింపి మరీ ఊరూవాడా తిరుగుతోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంక్‌గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అటు తన పర్యటనల జోరు కొనసాగిస్తున్నారు కేసీఆర్.

రాష్ట్రంలో అవినీతి పాలన అంతమే బీజేపీ లక్ష్యం అంటున్నారు అమిత్‌షా. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరులను జైలుకు పంపుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హొంమంత్రి. మరోవైపు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దొరలపాలు అయిందన్నారు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ. తెలంగాణలో మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలంటూ నినదిస్తున్నారు ఢిల్లీ నేతలు. సోనియా, మన్మోహన్ సింగ్ కారణంగానే తెలంగాణ సాకారమైందని.. ప్రజలు ఈ కాంగ్రెస్‌ను గెలిపించడానికి సిద్ధమయ్యారన్నారు ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్.
గుడ్ టు గ్రేట్ తెలంగాణ అంటూ నినాదం వినిపిస్తున్న బీఆర్ఎస్.. ప్రచారంలో దూకుడు పెంచింది. అటు సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో ప్రజల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యమేనంటూ విమర్శల దాడి పెంచారు. ధరణి రద్దు అయితే సంక్షేమం కూడా ఆగిపోతుందన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ నుంచి వచ్చే నేతల మాటలు విని ఆగం కావొద్దని పిలుపునిస్తున్నారు సీఎం కేసీఆర్.